Begin typing your search above and press return to search.

అమెరికాలో అమీర్ ఖాన్ ఏం చేశాడు?

By:  Tupaki Desk   |   15 March 2016 5:42 AM GMT
అమెరికాలో అమీర్ ఖాన్ ఏం చేశాడు?
X
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్.. ప్రస్తుతం దంగల్ చిత్రంలో నటిస్తున్నాడు. రెజ్లర్ మహావీర్ సిగ్ ఫోగట్ జీవిత చరిత్రపై రూపొందుతున్న ఈ మూవీలో రెండు రకాల గెటప్స్ లో అమీర్ కనిపిస్తాడు. రెజ్లర్ గాను, ఇద్దరు టీనేజ్ అమ్మాయిల తండ్రిగాను అమీర్ నటిస్తున్నాడు. మొదటగా తండ్రి పాత్ర కోసం షూటింగ్ ని కంప్లీట్ చేశాడు. ఈ రోల్ కోసం అమీర్ చాలానే బరువు పెరిగాడు.

మహావీర్ సింగ్ పూర్తిగా శాకాహారి కావడంతో.. వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటూనే తన బరువు 95కిలోలకు పెంచుకున్నాడు అమీర్. పీకేలో పర్ఫెక్ట్ బాడీని చూపించినపుడు.. అమీర్ బరువు 68 కిలోలు మాత్రమే. కనీసం కోడిగుడ్డు కూడా తినకుండానే.. 95 కిలోల వరకూ తన వెయిట్ పెంచుకున్నాడు అమీర్. బాగా బొద్దుగా వయసు మీరినట్లుగా కనిపించే ఆ పాత్ర షూటింగ్ అయిపోయాక.. అమెరికా వెళ్లిపోయాడు ఈ పర్ఫెక్షనిస్ట్. అక్కడి నుంచి తిరిగొచ్చే సరికి సన్నగా కనిపిస్తున్నాడు ఈ బాలీవుడ్ స్టార్.

ఇంతకీ ఇలా సన్నబడ్డానికి అమెరికాలో ఏం చేశాడంటే.. 'రోజుకు 6 గంటలు ఎక్సర్ సైజులు - టైం ప్రకారం తినడం - కంటినిండా నిద్రపోవడం.. అంతే'. అమెరికాలో ఉన్నన్ని రోజులు అమీర్ చేసింది ఇదే. ఇలాగే తన వెయిట్ ని 13 కిలోలు తగ్గించేసుకున్నాడు. రెజ్లర్ పాత్రకు రెడీ అయ్యేందుక మరో 12 కిలోలు తగ్గాలట. మరింతగా కరిగించేసి, ఆ పాత్రను త్వరలో షూటింగ్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు అమీర్ ఖాన్. ఒకట్రెండు కిలోలు తగ్గడానికే జనాలు నానా తంటాలు పడుతుంటే.. ఓ సినిమా కోసం అమీర్ ఖాన్ ఇలా బరువు పెరగడం, తగ్గడం సూపర్ కదూ.