Begin typing your search above and press return to search.

బుల్లితెర కోసం సూప‌ర్ స్టార్ సినిమా!

By:  Tupaki Desk   |   9 Feb 2019 12:00 PM IST
బుల్లితెర కోసం సూప‌ర్ స్టార్ సినిమా!
X
ఆయ‌నో సూప‌ర్ స్టార్‌. ఆ మాట కంటే కూడా మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్ గా అంద‌రికి సుప‌రిచితుడు. ఆయ‌నెవ‌రో కాదు.. బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒక‌రు అమీర్ ఖాన్. వైవిధ్య‌మైన సినిమాల్ని ఎంపిక చేసుకోవ‌టంలో మొన‌గాడిగా పేరున్న ఆయ‌న‌.. త‌న అభిరుచికి త‌గ్గ‌ట్లు సినిమాల్ని నిర్మించ‌టం కూడా ఆయ‌న‌కో అల‌వాటు.

అలాంటి అమీర్ తాజాగా నిర్మించిన ఒక సినిమా ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఆ సినిమాను వెండితెర కోసం కాదు.. బుల్లితెర కోసం నిర్మించ‌టం. అమీర్ లాంటి సూప‌ర్ స్టార్ భారీ ఎత్తున సినిమా తీయ‌కుండా బుల్లితెర కోసం సినిమా తీయ‌టం ఏమిటి? దాన్ని ఏడు భాష‌ల్లోకి డ‌బ్ చేయ‌టం ఏమిటి? అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు వ‌స్తున్నాయి.

దానికి ఆయ‌న బ‌దులిస్తూ.. ఒక మంచి సినిమాను ప్రేక్ష‌కుల‌కు చూపించాల‌న్న ఉద్దేశంతోనే తాను బుల్లితెర‌కు రుబారు రోషిణి మూవీని తీసిన‌ట్లు చెప్పారు. తాను కొత్త‌గా నిర్మించిన ఈ చిత్రం తీసే స‌మ‌యంలో ఒక‌లాంటి ఒత్తిడిని ఎదుర్కొన్న‌ట్లు అంగీక‌రించారు. ఒక మంచి సినిమాను ప్రేక్ష‌కుల‌కు చూపించాల‌నే ఒత్తిడి ఉంటుంది. రుబారు రోషిణి విష‌యంలో అలాంటి ఒత్తిడినే ఎదుర్కొన్నాన‌ని చెప్పారు.

అంద‌రికి క‌నెక్ట్ అయ్యే సినిమా అని.. చిత్ర ద‌ర్శ‌కురాలు స్వాతి చ‌క్ర‌వ‌ర్తి భ‌త్క‌ల్ ఈ సినిమా గురించి చెప్పిన వెంట‌నే తాను.. త‌న స‌తీమ‌ణి ఈ క‌థ‌కు క‌నెక్ట్ అయిన‌ట్లు చెప్పారు. ఈ సినిమాను ఒక్క‌సారి చూస్తేనే త‌న ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌చ్చింద‌ని.. కొంత‌మందికి ప్ర‌త్యేకంగా చూపించిన‌ప్పుడు వారి స్పంద‌న కూడా ఇదేలా ఉంద‌న్నారు.

ఒక సూప‌ర్ హిట్ సినిమా దేశ జ‌నాభాలో రెండు శాతం ప్ర‌జ‌లు మాత్ర‌మే చూసే ప‌రిస్థిత‌ని.. ఈ సినిమాను తీసేట‌ప్పుడు ఏ ఫ్లాట్ ఫాం కోసం తీయాల‌న్న ఆలోచ‌న చేయ‌లేద‌న్నారు. కానీ.. తొలి కాపీ చూసిన త‌ర్వాత మాత్రం ఈ సినిమాను దేశ‌మంతా చూడాల‌నుకున్న‌ట్లు చెప్పారు.

అందుకే.. బుల్లితెర అయితే బాగుంటుంద‌ని తాము ఫిక్స్ అయిన‌ట్లు చెప్పారు. బుల్లితెర మీద అయితే ఈ సినిమా ఎక్కువ మంది ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యే ఛాన్స్ ఉంటుంద‌ని.. అందుకే ఈ సినిమాను బుల్లితెర కోసమేన‌ని డిసైడ్ అయిన‌ట్లుగా చెప్పారు. ఒక మంచి సినిమాను దేశ ప్ర‌జ‌ల కోసం చూపించాల‌న్న త‌ప‌న అమీర్ లో ఉండ‌టం అభినందించాల్సిన విష‌యం. అదే స‌మ‌యంలో అమీర్ తెలివిని కూడా మెచ్చుకోవాలి.

ఒక మంచి సినిమాను ఎంత ప్ర‌మోట్ చేసినా వాణిజ్య‌ప‌రంగా క‌లిగే ప్రయోజ‌నం మీద సందేహ‌మే. అదే.. బుల్లితెర మీద అయితే అమీర్ ఛ‌రిష్మా.. బుల్లితెర కోసం సూప‌ర్ స్టార్ సినిమా తీయ‌టం లాంటి ప్ర‌చారం సినిమాకు కొత్త ఇమేజ్ తో పాటు.. శాటిలైట్ హ‌క్కుల రూపంలో భారీ ఆదాయం వ‌స్తుంద‌న్నఆలోచ‌న‌కు హేట్సాఫ్ చెప్పాల్సిందే. ఏమైనా అమీర్ అమీరే సుమా!