Begin typing your search above and press return to search.

మెగాస్టార్ తో అమీర్ ఖాన్ మూవీ.. సాధ్యమేనా?

By:  Tupaki Desk   |   2 Aug 2022 2:30 AM GMT
మెగాస్టార్ తో అమీర్ ఖాన్ మూవీ.. సాధ్యమేనా?
X
మెగాస్టార్ చిరంజీవి మొదటిసారి ఒక బాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు సమర్పకుడిగా ఉండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ఈనెల 11వ తేదీన భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాను అమీర్ ఖాన్ గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రమోట్ చేస్తూ ఉండడం విశేషం.

ఒక విధంగా బాలీవుడ్ లో కంటే తెలుగులోనే అతను ఎక్కువ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నట్లుగా అర్థమవుతుంది. ఇక ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరోలతో కూడా దీన్ని ఎక్కడికో తీసుకువెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఇదివరకే ప్రత్యేకంగా సినిమా ని చూడడమే కాకుండా వరుసగా ప్రెస్ మీట్స్ అలాగే స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా నిర్వహించడం విశేషం.

ఇక మెగాస్టార్ తో ఇటీవల నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో అమీర్ ప్రశ్నలు అడగడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఉంది అన్నట్లుగా తన కోరికను బయటపెట్టాడు. అయితే అమీర్ ఖాన్ తో ఒక సినిమా చేయాలి అంటే సింగిల్ టేక్ లోనే అన్ని ఓకే కావాలి అని ఎందుకంటే అతను పర్ఫెక్ట్ గా వచ్చే వరకు వదిలిపెట్టడు.. అనే విధంగా మెగాస్టార్ చిరంజీవి సరదాగా సమాధానం ఇచ్చారు.

అయితే ఈ క్రమంలో పక్కనే ఉన్న నాగార్జున మీరు నిర్మాతగా ఉంటే బెటర్ ఏమో అని సెటైర్ కూడా వేశాడు. దీంతో మరింత నవ్వులు వికసించాయి. అలాగే అమీర్ ఖాన్ అయితే ఏ విధంగా అయినా సరే మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాను అని తన మనసులోని మాటను బయటపెట్టాడు.

అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవికి మరొక ప్రశ్న ఎదురయింది. అమీర్ ఖాన్ నటించిన చిత్రాల్లో ఏ సినిమా చేయాలని అనుకుంటున్నారు అన్నప్పుడు ఆ విషయంలో పెద్దగా ఆలోచనలు లేకుండా అమీర్ ఖాన్ సినిమాలను చూడడమే కానీ చేయడం కుదరదు అని చిరు చాలా సున్నితంగా సమాధానం అయితే ఇచ్చారు..