Begin typing your search above and press return to search.

హాలీవుడ్‌ సినిమాలను అధికారికంగా దించేస్తున్నారు

By:  Tupaki Desk   |   17 Dec 2020 3:00 PM IST
హాలీవుడ్‌ సినిమాలను అధికారికంగా దించేస్తున్నారు
X
హాలీవుడ్ సినిమాలు కంటెంట్ పరంగా అద్బుతంగా ఉంటాయి. కొన్ని కథ ఐడియాలు అరె భలే ఉన్నాయో అన్నట్లుగా అనిపిస్తుంది. హాలీవుడ్‌ లో వచ్చిన ఎన్నో సినిమాలను ఇన్సిపిరేషన్‌ గా తీసుకుని ఇండియన్‌ భాషల్లో సినిమాలు చేసిన దాఖలాలు చాలానే ఉన్నాయి. కేవలం ఇండియన్‌ భాషల్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా హాలీవుడ్‌ సినిమాలను కాపీ కొట్టిన సందర్బాలు చాలా ఉన్నాయి. కేవలం హాలీవుడ్‌ సినిమాలను మాత్రమే కాకుండా ఇతర విదేశీ భాషలకు చెందిన సినిమాలను కూడా ఇండియన్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ రీమేక్‌ చేసిన సందర్బాలు ఉన్నాయి. అయితే ఒకప్పుడు అనధికారికంగా రీమేక్‌ చేసేవారు. కాని ఇప్పుడు మాత్రం అధికారికంగానే రీమేక్ చేస్తున్నారు.

ఒకప్పుడు ఇండియన్ భాషల్లో తెరకెక్కిన సినిమాలను హాలీవుడ్‌ ఫిల్మ్ మేకర్స్‌ పట్టుకోక పోవడం వల్ల కాపీ చేసినా పెద్దగా ఇబ్బంది లేదు. కాని ఇండియన్‌ సినిమాల పరిధి బాగా పెరిగింది. అందుకే ప్రతి ఇండియన్‌ సినిమా గురించి హాలీవుడ్‌ లో చర్చ జరుగుతుంది. కనుక హాలీవుడ్ సినిమాలను తెలియకుండా రీమేక్‌ చేసినా కూడా సోషల్‌ మీడియాలో కాపీ అంటూ ప్రచారం జరుగుతుంది. తెలుగులో రూపొందిన కొన్ని సినిమాలు కూడా హాలీవుడ్‌ సినిమాలకు కాపీ అంటూ గతంలో వార్తలు వచ్చాయి. అందుకే హాలీవుడ్‌ సినిమాలను ఏమైనా రీమేక్‌ చేయాలనుకున్నా కూడా కొనుగోలు చేస్తున్నారు.

ప్రస్తుతం బాలీవుడ్‌ లో సూపర్ స్టార్‌ అమీర్ ఖాన్‌ చేస్తున్న లాల్ సింగ్‌ చద్దా కు ఒరిజినల్‌ వర్షన్‌ హాలీవుడ్‌ మూవీ ఫారెస్ట్‌ గంప్. అధికారికంగా రీమేక్‌ ను అమీర్ చేస్తున్నాడు. కొన్ని కొరియన్‌ మూవీస్ మరికొన్ని ఇంగ్లీష్‌ సినిమాలను కూడా రీమేక్‌ చేస్తున్నారు. రీమేక్‌ అంటూ ముందే ప్రకటించడం వల్ల విమర్శలు ఏమీ ఉండవు. రీమేక్ అంటూ మార్చేసినా కూడా పట్టించుకునే వారు ఉండరు. కనుక హాలీవుడ్‌ సినిమాలను అధికారికంగా దించేసేందుకు మేకర్స్‌ ఆసక్తి చూపిస్తున్నారు. ముందు ముందు హాలీవుడ్‌ పాత సినిమాలు మరిన్ని ఇండియన్‌ స్ట్రీన్‌పై మనం చూసే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.