Begin typing your search above and press return to search.

ఆమిర్ పెద్ద షాక్ ఇచ్చాడుగా

By:  Tupaki Desk   |   25 April 2017 3:42 PM GMT
ఆమిర్ పెద్ద షాక్ ఇచ్చాడుగా
X
బాలీవుడ్ టాప్ స్టార్ స్థానానికి అన్ని విధాలా అర్హత ఉన్న ఆమిర్ ఖాన్.. ఒక విషయంలో మాత్రం చాలా దూరం పాటిస్తాడు. తనకు.. తన సినిమాలకు వచ్చిన అవార్డులను అందుకునేందుకు అస్సలు హాజరు కాడు. ఈ విషయంలో అనేక ఆరోపణలు వివాదాలు ఉన్న ఏ మాత్రం పట్టించుకోని నైజం ఆమిర్ ది. రీసెంట్ గా నేషనల్ అవార్డుల విషయంలో జరిగిన రచ్చ చూశాం.

అవార్డ్ ప్రకటిస్తే తీసుకునేందుకు హాజరు కానివాడికి అవార్డ్ ఎందుకు ఇవ్వాలని అంటూ జ్యూరీ ఛైర్మన్ ప్రియదర్శన్ చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. దానికి అస్సలే మాత్రం స్పందించని ఆమిర్ ఖాన్.. ఇప్పుడు ఓ ఈవెంట్ కు హాజరై అవార్డ్ అందుకోవడం టాక్ ఆఫ్ ది బాలీవుడ్ అయిపోయింది. మాస్టర్ దినానంత్ మంగేష్కర్ అవార్డుల్లో భాగంగా.. ఆమిర్ ఖాన్ కు విశేష పురస్కారం ప్రకటించగా.. దీన్ని స్వయంగా వచ్చి అందుకున్నాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ముంబైలో జరిగిన ఈ ఈవెంట్ లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేతుల మీదుగా ఆమిర్ ఖాన్ ఈ అవార్డ్ అందుకోవడం ఆశ్చర్యకరం.

అయితే.. తన తండ్రి జ్ఞాపకార్ధం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్.. ఆమీర్ ను స్వయంగా రిక్వెస్ట్ చేయడంతోనే ఈ ఈవెంట్ కు వచ్చాడట ఈ స్టార్ ఖాన్. లగాన్ తర్వాత మళ్లీ ఓ అవార్డ్ అందుకునేందుకు ఆమిర్ కు 16 ఏళ్లు పట్టడం విశేషం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/