Begin typing your search above and press return to search.

పూరీని ఫాలో అవుతున్న అమీర్ ఖాన్

By:  Tupaki Desk   |   5 May 2022 12:30 AM GMT
పూరీని ఫాలో అవుతున్న అమీర్ ఖాన్
X
టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ పాడ్ కాస్ట్ ల‌కు భారీ ఫాలోయింగ్ ఏర్ప‌డిన సంగ‌తి తెలిసిందే. పూరి త‌న‌దైన డిక్ష‌న్ స్టైల్ తో పాడ్ కాస్టుల రూపంలో బోలెడంత విజ్ఞానాన్ని పంచేందుకు ప్ర‌య‌త్నించారు. త‌న‌దైన డైలాగ్ పంచ్ ప‌వ‌ర్ ని కూడా చూపించారు.

ఇప్పుడు అదే త‌ర‌హాలో మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూడా పాడ్ కాస్ట్ లు ప్లాన్ చేస్తున్నారు. అమీర్ ఖాన్ తన మొదటి పాడ్ కాస్ట్ 'లాల్ సింగ్ చద్దా కి కహానియన్ ని ప్రారంభించనున్నారు. భారతీయ ప్రేక్షకులకు మ‌ర‌పురాని కొన్ని బ్లాక్ బస్టర్ లను అందించిన అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ .. ఇప్పుడు లాల్ సింగ్ చద్దాతో మరో హత్తుకునే కథను ప్రేక్ష‌కుల‌ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. అమీర్ ఖాన్- కరీనా కపూర్ ఖాన్- నాగ చైతన్య తదితరులు ఈ చిత్రంలో న‌టించారు.

ఈ భారీ మూవీ ప్రచారంలో భాగంగా సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఇప్పుడు తన కెరీర్‌లో మొదటిసారిగా తన స్వంత పోడ్ కాస్ట్ ను ప్రారంభించనున్నారు. ఈ కొత్త ప్రయత్నంలో పోడ్ కాస్ట్ 'లాల్ సింగ్ చద్దా కి కహానియాన్'తో తన ప్రేక్షకులతో కమ్యూనికేట్ చేయాల‌న్న‌ది త‌న ఉద్ధేశం. త‌ద్వారా అతను లాల్ సింగ్ చద్దా పాత్ర గురించి.. తెరవెనుక యాక్షన్ గురించి సినిమా నిర్మాణంలోని సంఘటనల గురించి చర్చిస్తాడు.

సంగీతం గురించి సెట్ నుండి ఆసక్తికరమైన సంఘటనల పైనా లాల్ సింగ్ చద్దాకు సంబంధించిన ఇతర వినోదాత్మక కథనాలు ఈ పాడ్ కాస్ట్ ల్లో ఉంటాయి. అమీర్ ఖాన్ పాడ్‌క్యాస్ట్ మే 5న విడుదల అవుతుందని T-సిరీస్ యూట్యూబ్ చానెల్ సావ‌న్ మరియు రెడ్ FMలో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.

ఇటీవలే అమీర్ ఖాన్ పెద్ద కహానీ గురించి మాట్లాడుతున్న వీడియో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత లాల్ సింగ్ చద్దా నిర్మాతలు ఈ చిత్రం నుంచి మొదటి పాటను విడుదల చేశారు. ఆసక్తికరంగా సూపర్ స్టార్ అమీర్ ఖాన్ స్వయంగా లాల్ సింగ్ చద్దా ఆల్బమ్ నుండి వీడియోలను విడుదల చేయకూడదని భావిస్తున్నారు. బదులుగా ఆడియో మాత్రమే విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేసారు.

లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని అమీర్ ఖాన్- కిరణ్ రావు ల‌తో క‌లిసి వయాకామ్ 18 స్టూడియోస్ నిర్మించింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఎరిక్ రోత్ - అతుల్ కులకర్ణి స్క్రీన్‌ప్లే రాసారు. ఈ చిత్రం 11 ఆగ‌స్టు 2022న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది.