Begin typing your search above and press return to search.

రాజమౌళి సార్ అమీర్ ఖాన్ వైపు ఓ చూపు చూడండి!

By:  Tupaki Desk   |   5 Aug 2022 1:30 PM GMT
రాజమౌళి సార్  అమీర్ ఖాన్ వైపు  ఓ చూపు చూడండి!
X
బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ స్టార్ డ‌మ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఖాన్ త‌రం హీరోల్లో అమీర్ ప్ర‌స్థానం ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది. బాలీవుడ్ టాప్ -10 హీరోల్లో అమీర్ ఒక‌రు. ఇండియాన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన చ‌రిత్ర అమీర్ సొంతం. ఇంకా చె ప్పాలంటే? బాక్సాఫీస్ నెంబ‌ర్ హీరోగా ఇప్ప‌టికీ ఆ రికార్డు ఆయ‌న సొంత‌మే.

`దంగల్` తో 2000 కోట్ల వ‌సూళ్ల ని కొల్ల‌గొట్టిన ఒకే ఒక్క‌స్టార్ అమీర్. ఆ ర‌కంగా ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ స్టార్ ఎవ‌ర‌ని? చెప్పాల్సి వ‌స్తే అమీర్ పేరు మాత్ర‌మే చెప్పాలి. అంత‌టి దిగ్గ‌జ న‌టుడు పిలిస్తే క్యూలో నుంచి సినిమాలు చేయ‌డానికి ఎంతో మంది స్టార్ మేక‌ర్స్ రెడీగా ఉన్నారు. అమీర్ పై వంద‌ల కోట్ల రూపాయ‌లు పెట్టుబడి పెట్ట‌డానికి బ‌డా నిర్మాణ సంస్థ‌లెన్నో క్యూలో ఉన్నాయి.

కానీ అమీర్ ఖాన్ మ‌న‌సు లో మాత్రం స్థానం సంపాదించుకున్న ద‌ర్శ‌కుడు టాలీవుడ్ స్టార్ మేక‌ర్ రాజ‌మౌళి అని తెలుస్తోంది. ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేయాల‌ని ఉంద‌ని అడిగిన వెంట‌నే మ‌రో ఆలోచ‌న లేకుండా రాజ‌మౌళి పేరు చెబుతున్నారు అమీర్. వేదిక ఎలాంటిది అయినా ఆ ప్ర‌శ్న వినిపిస్తే చాలు జ‌క్క‌న్న జ‌పం మొద‌లైపోతుంది.

అత‌ని స‌క్సెస్ ల్ని ఎంతో గొప్ప‌గా చెబుత‌న్నారు. వాస్త‌వానికి అమీర్ ఖాన్ రాజ‌మౌళి జ‌పం ఇప్ప‌టి నుంచి కాదు కొన్ని సంవ‌త్స‌రాలుగా చేస్తున్నారు. రాజ‌మౌళి తెర‌కెక్కించిన `బాహుబ‌లి` మొదటి భాగం రిలీజ్ అయి స‌క్సెస్ అయిన నాటి నుంచి జ‌క్క‌న్న‌తో సినిమా చేయాల‌ని అమీర్ అంటున్నారు. అటుపై రాజ‌మౌళి తెర‌కెక్కించిన `బాహుబ‌లి` రెండ‌వ భాగం..`ఆర్ ఆర్ ఆర్` చిత్రాలు స‌క్సెస్ అవ్వ‌డంతో జ‌క్క‌న్న జ‌పం మ‌రి పెరిగిపోయింద‌ని చెప్పొచ్చు.

ఇంకా చెప్పాలంటే ఇంతగా జ‌పం తెలుగు హీరోలే చేయ‌ర‌ని చెప్పొచ్చు. ఆ ర‌కంగా అమీర్ -రాజ‌మౌళి చాలా క్లోజ్ అయ్యారు. అప్ప‌టి నుంచి అమీర్ ఖాన్ ఏ సినిమా చేసినా కచ్చితంగా రాజ‌మౌళికి స్పెష‌ల్ వేసి చూపిస్తున్నారు. ఆయ‌న ఫీడ్ బ్యాక్ కూడా ద‌గ్గ‌రుండి తీసుకుంటారు. అలాగే రాజ‌మౌళి కూడా అమీర్ ని అంతే అభిమానిస్తారు.

టాలీవుడ్ లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌ట‌న‌ని ఎంత‌గా ఇష్ట‌ప‌డ‌తారో? బాలీవుడ్ లో అమీర్ పెర్పార్మెన్స్ కి అంత‌గా ఫిదా అవుతుంటారు. తాజాగా క‌ర‌ణ్ జో హార్ షోలో కూడా అమీర్ -జ‌క్క‌న్న జప‌మే చేసారు. దీంతో రాజ‌మౌళి సార్ అమీర్ తో ఓ సినిమా చేసేయండి సార్.. ఎప్ప‌టి నుంచో మీకోసం అమీర్ వెయిట్ చేస్తున్నారంటూ పోస్ట్ లు పెడుతున్నారు. ఆ స‌మ‌యం కూడా ద‌గ్గ‌ర్లోనే ఉండాల‌ని ఆశిద్దాం.