Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: స్టార్ కిడ్ పచ్చబొట్టు.. నాభి రింగు

By:  Tupaki Desk   |   4 Jun 2019 8:52 AM GMT
ఫోటో స్టొరీ: స్టార్ కిడ్ పచ్చబొట్టు.. నాభి రింగు
X
స్టార్ కిడ్స్ అంటేనే ప్రేక్షకుల్లో సాధారణంగానే ఆసక్తి ఉంటుంది. దానికి తగ్గట్టే స్టార్ కిడ్స్ కూడా తమ సోషల్ మీడియా ఖాతాలా ద్వారా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ను నెటిజనులతో పంచుకుంటూ ఉంటారు. ఇక మీడియా కవరేజ్ సరేసరి. బాలీవుడ్ లో భారీ మార్కెట్ ఉన్న ఖాన్ ఎవరయ్యా అంటే.. మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న ఆమీర్ ఖాన్. ఆయన పిల్లలంటే అందరికీ ఆసక్తే.

అమీర్ కు మొదటి భార్య రీనా దత్ ద్వారా జునైద్ ఖాన్.. ఈరా ఖాన్ అనే ఇద్దరు పిల్లలున్నారు. రెండో భార్య కిరణ్ రావు ద్వారా ఆజాద్ రావ్ ఖాన్ అనే మరో అబ్బాయి ఉన్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఈరా ఖాన్ గురించే. 20 ఏళ్ళ ఈరా రీసెంట్ గా తన ఒంటిపై పచ్చబొట్టు పొడిపించుకుంది. ఎడమ చేతిపై 'ఇఫ్ వీ వాంట్ హూ విల్' అనే ఇంగ్లీష్ ఫ్రేజ్ ను పచ్చబొట్టుగా పొడిపించుకుంది. అంతటితో ఆగలేదు. నాభి దగ్గర ఒక రింగ్ ను కూడా పెట్టుకుంది. ఈరాకు ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తూ ఇది తనకు మొదటి పచ్చబొట్టు అని తెలిపింది. దానికి క్యాప్షన్ గా "ఇఫ్ వీ వాంట్ హూ విల్ #మొదటి పచ్చబొట్టు # ప్రయత్నిస్తూనే ఉండండి" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ఈ దెబ్బతో ఒక్కసారిగా ఈరా ఖాన్ వార్తల్లో వ్యక్తి అయిపోయింది. ఈ హంగామా చూస్తుంటే ఈరా త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందనే గుసగుసలు మొదలయ్యాయి. ఈరా సంగతేమో కానీ ఈరా సోదరుడు జునైద్ హీరోగా వచ్చేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.