Begin typing your search above and press return to search.

స్టార్ డాటర్.. అదే ప్రయత్నాల్లో ఉందా

By:  Tupaki Desk   |   24 Dec 2016 5:30 PM GMT
స్టార్ డాటర్.. అదే ప్రయత్నాల్లో ఉందా
X
బాలీవుడ్ లో చాలామంది స్టార్ ల వారసులు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేయగా.. ఇంకా రంగంలోకి దిగడానికి రెడీగా ఉన్న బ్యూటీస్ బోలెడంత మంది ఉన్నారు. శ్రీదేవి కూతురు - అమితాబ్ మనవరాలు.. సైఫ్ డాటర్ - జాకీ ష్రాఫ్ కూతురు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఈ లిస్ట్ చాలా పెద్దదే ఉంటుంది. ఈ లిస్ట్ లో ఆమిర్ ఖాన్ డాటర్ ఇరా ఖాన్ కూడా చేరిపోతోందా అని అనుమానిస్తోంది టాలీవుడ్.

రీసెంట్ గా దంగల్ మూవీ స్క్రీనింగ్ కోసం ఆమిర్ ఖాన్ తో కలిసి కూతురు ఇరా ఖాన్ సందడి చేసింది. ఆమిర్ కూతుర్ని ఇలా చూడ్డం బాలీవుడ్ కే కాదు.. జనాలందరికీ ఇదే మొదటిసారి. స్లీవ్ లెస్ డ్రస్.. నడుముతో పాటు నాభి అందాలు కనిపించేలా డ్రెసింగ్.. కొంచెంగా క్లీవేజ్ షో.. ఇప్పటికైతే దీనికి గ్లామర్ అనో.. ఫ్యాషన్ అనో పేరు పెట్టచ్చు కానీ.. చాలామంది వారసులు ఇలా మొదలుపెట్టి.. తర్వాత దాన్నే పీక్ స్టేజ్ కి తీసుకెళ్లిపోయారు. ఇండస్ట్రీపై అమ్మడికి అభిమానం పెరిగిందని అనిపించడానికి రీజన్ ఇదే.

ఆమిర్ కూతురు ఇరా ఖాన్.. తెరంగేట్రం చేయడంపై ఇప్పటివరకూ ఓ టాక్ ఉంది. తనకు సినిమాలంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదని.. ఫిలిమ్స్ లో చేయబోనని తెగేసి చెప్పింది. కాకపోతే ఇది జరిగి చాలాకాలం అయిపోయింది. ఇప్పుడీ కుర్ర భామ మనసు మార్చుకుందనే డౌట్స్ మొదలైపోయాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/