Begin typing your search above and press return to search.

వీడియో: అమీర్ వార‌సురాలు క‌ఠోర శ్ర‌మ‌

By:  Tupaki Desk   |   28 Sep 2019 1:30 AM GMT
వీడియో: అమీర్ వార‌సురాలు క‌ఠోర శ్ర‌మ‌
X
న‌ట‌వార‌సురాలు అన్న ట్యాగ్ ని మోయ‌డం ఎంత క‌ష్ట‌మో ఇదిగో ఇక్క‌డ మిస్ట‌ర్ పెర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ వార‌సురాలి శ్ర‌మ‌ను చూస్తే అర్థం చేసుకోవ‌చ్చు. ఇంత హార్డ్ వ‌ర్క్ మునుపెన్న‌డూ చేసి ఉండ‌దేమో ఐరా ఖాన్. ఇటీవ‌ల గత కొంత‌కాలంగా ఐరా ఖాన్ హార్డ్ వ‌ర్క్ చూస్తుంటే సంథింగ్ ఏదో సాధించాల‌న్న త‌ప‌న క‌నిపిస్తోంది.

క‌థానాయిక అయ్యేందుకే ఇంత‌గా శ్ర‌మిస్తోందా అంటే.. తాను కెమెరా వెన‌క ఉండేందుకే ఇష్ట‌ప‌డ‌తాన‌ని ప‌దే ప‌దే చెబుతోంది. ద‌ర్శ‌క‌త్వంలో శిక్ష‌ణ పొందుతోంది. అయితే ఇటీవ‌ల గ‌త కొంత‌కాలంగా నా మ‌న‌సుకు తోచింది చేస్తున్నా అంటూ త‌న స్నేహితురాళ్ల‌తో క‌లిసి ఫోటోషూట్లు చేసి సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేస్తోంది. అందరు స్టార్ కిడ్స్ లానే తాను కూడా ఫాలోయింగ్ ని పెంచుకునేందుకు తెగ త‌పిస్తోంది.

ఐరా మ‌రీ ఇంత‌గా ఎందుకు త‌పిస్తోంది? అన్న‌ది అర్థం కావ‌డం లేదు. తాజాగా జిమ్ లో ఎంతో హార్డ్ వ‌ర్క్ చేస్తూ ర‌క‌ర‌కాల వ‌ర్క‌వుట్లు చేస్తున్న ఫోటోల్ని- వీడియోల్ని ఐరా షేర్ చేస్తూనే ఉంది. తాజాగా రివీల్ చేసిన ఓ ఫ‌న్నీ వ‌ర్క‌వుట్ సెష‌న్ వీడియో కుర్ర‌కారులో జోరుగా వైర‌ల్ అవుతోంది. పుష‌ప్స్ చేసేప్పుడు త‌న నాభి కేంద్రం చుట్టూ తిప్పుతున్న ఆ స్టిక్ వ్య‌వ‌హారం కాస్త అదోలా ఉంద‌న్న వ్యాఖ్య‌లు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి.

వీడియో కోసం క్లిక్ చేయండి