Begin typing your search above and press return to search.

మనపై దాడి చేయనున్న అమీర్ ఖాన్

By:  Tupaki Desk   |   21 Nov 2016 7:00 PM IST
మనపై దాడి చేయనున్న అమీర్ ఖాన్
X
ఓ రెండు మూడు సంవత్సరాల నుండి షారూఖ్ ఖాన్.. ఈ మద్యనే అక్షయ్ కుమార్ అండ్ సల్మాన్.. ఇక ఇప్పుడు అమీర్ ఖాన్.. అందరూ కూడా తెలుగు మార్కెట్ ను ఎట్టి పరిస్థితుల్లో వదిలపెట్టకూడదని ఫిక్సయ్యారు. ఆ క్రమంలో ఇప్పుడు అమీర్ తన దాడికి సన్నద్దమవుతున్నాడు.

ఈ మధ్యన సల్లూ భాయ్ తన ప్రేమ రతన్ ధన పాయో సినిమాకు ఏకంగా రామ్ చరణ్‌ తో తెలుగు డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేయించాడు. ఆ తరువాత అక్షయ్ కుమార్ రుస్తుం సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి ఏకంగా యాంకర్ ప్రదీప్ షో కు విచ్చేశాడు కూడా. ఇప్పుడు అమీర్ ఖాన్ వంతొచ్చింది. మనోడు సొంతంగా నిర్మించిన ''దంగల్'' సినిమాను ఇప్పుడు ''యుద్దం'' పేరుతో తెలుగులో ఒకేసారి హిందీ వెర్షన్ తో కలిపి రిలీజ్ చేస్తున్నాడు. భారతీయ వ్రెజ్లర్లు అయిన ఫోగట్ సిస్టర్స్ కథను సినిమాగా తీసిన అమీర్.. తెలుగులో కూడా ఒకేసారి రిలీజ్ చేయడం మరి మన మార్కెట్ పై ఉన్న అంచనాలు ఏంటో చెప్పకనే చెబుతుంది.

ఇకపోతే స్వయంగా డిస్నీ ఇండియా కూడా ఈ సినిమాలో నిర్మాణ భాగస్వామి కాబట్టి.. తెలుగులో అమీర్ చేయబోయే దాడి స్థాయి కాస్త పెద్దగానే ఉండొచ్చు. మిగతా బాలీవుడ్ హీరోలు ఎవ్వరూ టాలీవుడ్ లో తెలుగు వర్షన్ తో ఆ రేంజులో ప్రూవ్ చేసుకోలేదు కాని.. అమీర్ మాత్రం ఇంప్రెస్ చేస్తాడనే అంటున్నారు ప్రేక్షకులు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/