Begin typing your search above and press return to search.

ఒత్తిడిలో చ‌డ్డా.. ఫ్లాపుల‌తో బెంబేలెత్తాన‌న్న అమీర్

By:  Tupaki Desk   |   4 Aug 2022 3:30 PM GMT
ఒత్తిడిలో చ‌డ్డా.. ఫ్లాపుల‌తో బెంబేలెత్తాన‌న్న అమీర్
X
బాక్సాఫీస్ వద్ద హిందీ చిత్రాల వరుస పరాజయాల న‌డుమ `లాల్ సింగ్ చడ్డా` గురించి ఆందోళన చెందుతున్నట్లు అమీర్ ఖాన్ అంగీకరించాడు. ``అగర్ ఫిల్మ్ లోగోన్ కో పసంద్ నహిన్ ఆయీ.. బహుత్ దిల్ టూత్ జాయేగా`` అంటూ అమీర్ ఖాన్ బాక్సాఫీస్ వద్ద ఇటీవల వరుస ఫ్లాప్ ల గురించి ..అలాగే లాల్ సింగ్ చడ్డా స‌న్నివేశం గురించి తాను ఆందోళన చెందుతున్నానాన‌ని బ‌హిరంగ వేదిక‌పై అన్నారు.

కాఫీ విత్ కరణ్ సీజన్ 7 ఐదవ ఎపిసోడ్‌లో లాల్ సింగ్ చడ్డా స్టార్ లు అమీర్ ఖాన్ -కరీనా కపూర్ ఖాన్ క‌ర‌ణ్ ముందు ఈ విష‌యాన్ని అంగీక‌రించారు. బాక్సాఫీస్ వద్ద హిందీ చలనచిత్ర పరిశ్రమ తాజా ప‌రాజ‌యాల‌ పరంపర లో భాగంగా కొన్ని పెద్ద చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఎంత పేలవంగా ఆడాయో ఆ ఇద్ద‌రూ స్పృశించారు. సంభాషణల‌ సమయంలో కరణ్ జోహార్ త‌న త‌దుప‌రి విడుద‌ల‌ గురించి అమీర్ ఖాన్ ను ప్ర‌శ్నించారు. రాబోవు ఫలితం గురించి మీరు ఒత్తిడికి గురయ్యారా? అని అమీర్ ని అడ‌గ్గా అత‌డు దానిని ఒప్పుకున్నాడు.

మీరు ఒత్తిడిలో ఉన్నారా? అని క‌ర‌ణ్ స్ట్రెస్ చేయ‌గా.. దానికి అమీర్, ``అవును నేను ఒత్తిడికి లోనయ్యాను.. కైసే సవాల్ పూచ్ రహా హై యార్ (మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు?)`` అని కూడా బదులిచ్చారు. అమీర్ స్పందన విన్న కరీనా ఆశ్చర్యపోయి ..``మీరేనా? కానీ మీరు చాలా నమ్మకంగా ఉన్నారు క‌దా?``.. ``మేము ఒక మంచి చిత్రాన్ని రూపొందించినందుకు సంతోషిస్తున్నాం.. లేకీన్ అగర్ ఫిల్మ్ లోగోన్ కో పసంద్ నహిన్ ఆయీ.. బహుత్ దిల్ టూత్ జాయేగా (ప్రజలు ఇష్టపడకపోతే,.. మా గుండెలు ప‌గిలిపోతాయి) అని అన్నారు. మొత్తానికి లాల్ సింగ్ చ‌డ్డాపై అమీర్ చాలా ఆశ‌లే పెట్టుకున్నాడు.

కానీ అవి నెర‌వేరుతాయా లేదా? అన్న శంస‌యం నిలువ‌నీయ‌డం లేదు. ఇటీవ‌ల‌ హిందీ పెద్ద చిత్రాలు ఆడ‌క‌పోవ‌డ‌మే దీనికి కార‌ణం. ఎంతో భారీ అంచ‌నాల‌తో వ‌చ్చిన 83 - ర‌న్ వే 34- సామ్రాట్ పృథ్వీరాజ్ లాంటి చిత్రాలు డిజాస్ట‌ర్లు గా నిల‌వ‌డంతో అమీర్ బేల‌గా మారాడు.

కరణ్ జోహార్ బాక్సాఫీస్ వద్ద హిందీ చిత్రాల పనితీరు గురించి ఈ వేదిక‌పై మాట్లాడాడు. కంటెంట్ వినియోగించే ప్రేక్షకుల విధానంలో మార్పు వచ్చిందా ? అని కూడా అమీర్ ను అడిగాడు. దిల్ చాహ్తా హై-లగాన్- రంగ్ దే బసంతి - తారే జమీన్ పర్ వంటి చిత్రాలకు అమీర్ ఎలా ఒక కారణకుడ‌య్యారు! అంటూ కరణ్ చమత్కరించాడు. అమీర్ ఒత్తిడిని అత‌డు మ‌రింత స్ట్రెస్ చేసాడు. ఇటీవ‌ల‌ ప్రేక్షకుల ఆలోచనలలో కూడా మార్పును స్వాగ‌తించాల‌ని చ‌ర్చ‌కు వ‌చ్చింది. అమీర్ మాట్లాడుతూ ``కాదు. ... మీది (ప్రేక్ష‌కుల‌ది) తప్పు కాదు.. ఇవి హార్ట్ ల్యాండ్ సినిమాలు.. ఇవి భావోద్వేగాలను కలిగి ఉంటాయి.

ప్రజలు వాటితో కనెక్ట్ అవుతారు. తారే జమీన్ పర్-త‌ర‌హాలో ప్రతి ఇంటికి ఒక బిడ్డ ఉంటుంది-రంగ్ దే బసంతి ఒక భావోద్వేగ చిత్రం.. ఇది అట్టడుగు స్థాయికి కనెక్ట్ అవుతుంది. యాక్షన్ సినిమాలు తీయండి అని నేను చెప్పడం లేదు.. కానీ మంచి సినిమాలు తీయండి.. ప్రజలకు సంబంధించిన టాపిక్స్ తీసుకోండి. మ‌నం ఏదైనా తప్పు చేస్తున్నామని చెప్పడం లేదు.. ప్రతి చిత్రనిర్మాతకి స్వేచ్ఛ ఉంటుంది.. కానీ భారతదేశంలోని ఎక్కువ మంది ఆసక్తి లేనిదాన్ని ఎంచుకున్నప్పుడు సముచితమైన ఆలోచ‌న చేయాలి..`` అని అన్నారు.అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా ఆగష్టు 11 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.