Begin typing your search above and press return to search.
ఫ్లాప్ కు పూర్తి బాధ్యత నాదే
By: Tupaki Desk | 26 Nov 2018 9:51 PM ISTఈ సంవత్సరంలోనే కాకుండా ఈమద్య కాలంలోనే అతి పెద్ద డిజాస్టర్ అంటే ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ అంటూ బాలీవుడ్ మీడియా నుండి గల్లీ మీడియా వరకు కథనాలు వస్తున్నాయి. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం కనీసం 100 కోట్ల షేర్ కూడా రాబట్టలేక పోయిందనే టాక్ బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మిస్టర్ పర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ ఇటీవల కాలంలో వరుసగా మంచి చిత్రాలతో బాలీవుడ్ టాప్ కలెక్షన్స్ ను సాధించాడు. కాని ఈ చిత్రం మాత్రం ఆయన కెరీర్ లోనే మాయని మచ్చ అంటూ అభిమానులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమీర్ ఖాన్ తో పాటు ఈ చిత్రంలో అమితాబచ్చన్ కూడా ఉండటంతో డబుల్ హిట్ అవుతుందని, సునాయాసంగా బాహుబలి వసూళ్లను క్రాస్ చేస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు ఆశించారు. కాని థగ్స్ తీవ్రంగా నిరాశ పర్చారు. ఏమాత్రం ఆకట్టుకోని కథ - కథనంతో విజయ్ కృష్ణ ఆచార్య ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న తర్వాత మొదటి సారి అమీర్ ఖాన్ సినిమా ఫ్లాప్ గురించి స్పందించాడు. సినిమా ఫ్లాప్ కు పూర్తి బాధ్యత తానే వహిస్తానంటూ ప్రకటించాడు.
‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు పూర్తిగా ప్రయత్నించాం. కాని అనుకున్నది సాధ్యం కాలేదు. మేం ఏదైతే అనుకున్నామో అది తీశాం, కాని అది ప్రేక్షకులు తిరష్కరించారు. కొంతమందికి సినిమా నచ్చిందని అన్నారు. వారికి నా కృతజ్ఞతలు చెబుతున్నాను అన్నాడు. అయితే ఎక్కువ మందికి మాత్రం మా సినిమా నచ్చలేదని తెలుసుకున్నాం. అందుకే అభిమానులకు క్షమాపణలు చెబుతున్నాను అన్నాడు. ఈసారి మిమ్ములను ఎంటర్ టైన్ చేయలేక పోయినందుకు క్షమించాలని అమీర్ అన్నాడు.
థగ్స్ ఫ్లాప్ కు తానే కారణమని ఒప్పుకుని సారీ చెప్పిన అమీర్ ఖాన్, మరి డిస్ట్రిబ్యూటర్ల నష్టాలను భరించేందుకు ముందుకు వస్తాడా అనేది చూడాలి. గత కొన్ని రోజులుగా డిస్ట్రిబ్యూటర్ల తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం తెల్సిందే.