Begin typing your search above and press return to search.

క‌న్విన్స్ చేసేందుకు `అమీర్ - కిర‌ణ్` పాట్లు

By:  Tupaki Desk   |   4 July 2021 8:00 PM IST
క‌న్విన్స్ చేసేందుకు `అమీర్ - కిర‌ణ్` పాట్లు
X
15ఏళ్ల సంసార జీవ‌నాన్ని విచ్ఛిన్నం చేస్తూ.. త‌న రెండో భార్య కిరణ్ రావుకు విడాకులిస్తున్న అమీర్ ఖాన్ పై ట్రోల‌ర్స్ తీవ్రంగా విరుచుకుప‌డుతున్నారు. దంగ‌ల్ బ్యూటీ స‌నా షేక్ ని పెళ్లాడేందుకు లైన్ క్లియ‌ర్ చేసుకున్నాడంటూ తీవ్రంగా దూషిస్తున్నారు. ఓ ప‌ట్టాన అభిమానులు నెటిజ‌నుల ఆగ్ర‌హానికి అమీర్ చిన్న‌బుచ్చుకుంటున్న‌ట్టే క‌నిపిస్తోంది. ఇక మీ సినిమాలు చూడ‌లేం! అంటూ విరుచుకుప‌డుతున్న వారికి అమీర్ స‌మాధానం ఇవ్వ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది.

ఇదిలా ఉంటే త‌న అభిమానుల‌ను క‌న్విన్స్ చేసేందుకు తాజాగా ఓ వీడియో సందేశంతో అమీర్ - కిర‌ణ్ జంట ముందుకు వ‌చ్చారు. ఈ వీడియోలో అమీర్ త‌న భార్య‌ కిరణ్ చేతులు పట్టుకొని కనిపించారు. అయితే వారు ఇప్పటికీ ఒకే కుటుంబంలో భాగమని ప్రేక్షకులకు భరోసా ఇచ్చారు. వారి మధ్య ప్రతిదీ స్నేహపూర్వక బంధ‌మని పేర్కొంటూ.. మాజీ జంట ఒకరి పక్కన ఒక‌రు కూర్చుని హిందీలో త‌మ స్పీచ్ ని ఇచ్చారు. ``మీరంతా ఈ వార్తలతో బాధప‌డ‌తారు.. షాక్ అవుతారు.. కానీ మేము చాలా సంతోషంగా ఉన్నామని.. ఒక కుటుంబంలో భాగమని మీకు చెప్పాలనుకుంటున్నాం`` అని అన్నారు. బంధం మారినా స్నేహం కొన‌సాగుతుంద‌ని అమీర్ తెలిపారు. ఈ జంట‌ తమ లాభాపేక్షలేని సంస్థ పానీ ఫౌండేషన్ ను తమ బిడ్డగా భావిస్తామ‌ని చెప్పారు. పానీ ఫౌండేషన్ మా కొడుకు ఆజాద్ లాంటిది. మేము ఎల్లప్పుడూ కుటుంబం.. దయచేసి మా ఆనందం కోసం ప్రార్థించండి. మేము చెప్పదలచుకున్నది ఇదే .. అని వీడియో సందేశం ముగించారు.

ఈ వీడియో ఫ్యాన్స్ కి మ‌రింత షాకింగ్. ముఖ్యంగా అమీర్ ఆ వీడియోలో మాట‌ల‌తో త‌డ‌బ‌డ్డాడు.. కలవరపడ్డారు. సంతోషంగా ఉన్నామ‌ని చెబుతున్నా.. ఏదో స్వ‌రం మారింద‌ని అర్థ‌మ‌వుతోంది. ఈ వీడియోలో కిరణ్ తన బాధను దాచడానికి ప్రయత్నిస్తున్నారని ఫ్యాన్స్ ఆరోపించారు.