Begin typing your search above and press return to search.

'ఆమని ఉంటే'.. 'డియర్ మేఘ' నుంచి బ్యూటిఫుల్ మెలోడీ..!

By:  Tupaki Desk   |   16 July 2021 6:30 AM GMT
ఆమని ఉంటే.. డియర్ మేఘ నుంచి బ్యూటిఫుల్ మెలోడీ..!
X
మేఘా ఆకాష్ - అరుణ్ ఆదిత్ - అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న సినిమా ''డియర్ మేఘ''. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంగ్ ఫిల్మ్ మేకర్ సుశాంత్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు విడుదలైన ఫస్ట్ లుక్ మరియు ఇతర స్పెషల్ పోస్టర్స్ ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఈ నేపథ్యంలో చిత్రంలోని 'ఆమని ఉంటే పక్కన..' అనే లిరికల్ సాంగ్ ను తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే విడుదల చేసి చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలిపారు.

'ఆమని ఉంటే పక్కన.. ఏమని చెప్పను భావన.. పోతే మళ్లీ రాదనా.. మళ్లీ మళ్లీ చూడనా..' అంటూ సాగిన ఈ బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ కు హరి గౌర ఫ్రెష్ ట్యూన్ సమకూర్చారు. 'ఏ తీపిముల్లో నాటి గుండెల్లో నవ్వై పూసిందో.. నీ ఊపిరేమో వెచ్చంగ మెల్లో ఇల్లా తాకిందో.. నా ధ్యాస మొత్తం నీ మాయలోకే అల్లా జారిందో..' అంటూ లవ్ సాంగ్స్ స్పెషలిస్ట్ కృష్ణకాంత్ మరోసారి ప్రేమను తెలియజెప్పే సాహిత్యం అందించారు. యువ గాయకుడు అనురాగ్ కులకర్ణి వాయిస్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అరుణ్ ఆదిత్ - మేఘా ఆకాష్ ల మీద చిత్రీకరించిన ఈ అందమైన లవ్ సాంగ్ శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ఓ అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా ''డియర్ మేఘ'' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ఐ ఆండ్రూ సినిమాటోగ్రఫీ అందించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది.