Begin typing your search above and press return to search.

సౌంద‌ర్య‌ గ‌లీజు బ‌ట్ట‌లు వేసుకోక‌పోవ‌డానిక కార‌ణం అదే!

By:  Tupaki Desk   |   18 March 2021 3:30 PM GMT
సౌంద‌ర్య‌ గ‌లీజు బ‌ట్ట‌లు వేసుకోక‌పోవ‌డానిక కార‌ణం అదే!
X
సినిమా ఇండ‌స్ట్రీలో హీరోయిన్ల స‌క్సెస్ మంత్రం స్కిన్ షోనే! ఒంపు సొంపులు చూపిస్తేనే.. అందాలు ఆర‌బోస్తేనే.. కెరీర్ లో విజ‌యం ద‌క్కుతుంద‌ని భావిస్తుంటారు న‌టీమ‌ణులు. ఏ ఒక్క‌రో ఇద్ద‌రినో మిన‌హాయిస్తే.. దాదాపుగా అంద‌రూ ఫాలో అయ్యే ట్రెండ్ ఇదే. కానీ.. ఈ ట్రెండ్ ను బ్రేక్ చేయ‌డం ఒక్క‌రికి మాత్ర‌మే సాధ్య‌మైంది. ఆమే.. అమిత సౌంద‌ర్య‌రాశి, నిన్న‌టి త‌రం న‌టి సౌంద‌ర్య‌.

అభిన‌వ సావిత్రిగా యావ‌త్ ప్రేక్ష‌క‌లోకం నుంచి నీరాజ‌నం అందుకున్నారు సౌంద‌ర్య‌. క‌ళ్ల‌తోనే అద్భుత‌మైన‌ భావాలు ప‌లికించ‌గ‌ల అరుదైన న‌టిగా గుర్తింపు పొందిన సౌంద‌ర్య‌.. త‌న క‌ట్టూ బొట్టుతో కూడా అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. సినిమాలో పాట అంటే.. చిట్టి పొట్టి నెక్క‌ర్లు వేసుకోవాల్సిందే.. ఎద పొంగులు ఎర‌గా వేయాల్సిందేన‌నే సూత్రాన్ని ఇండ‌స్ట్రీ న‌మ్ముతున్న స‌మ‌యంలో కూడా సంప్ర‌దాయ చీర‌క‌ట్టుతో మెరిశారామె. అంతేకాదు.. స్కిన్ షో చేస్తేనే స‌క్సెస్ వ‌స్తుంద‌న్న అభిప్రాయాన్ని మార్చేసి, అగ్ర‌తార‌గా వెలుగొందారు.

దాదాపు 17 సంవ‌త్స‌రాల క్రితం జ‌రిగిన‌ విమాన ప్ర‌మాదంలో ఆమె మ‌ర‌ణించిన‌ప్ప‌టికీ.. వెండితెర‌పై ఆమె వేసిన ముద్ర మాత్రం ఇప్ప‌టికీ స‌జీవంగానే ఉంది. ఆమె బ‌యోపిక్ అంశం హాట్ టాపిక్ గా మార‌డం, అందులో న‌టించేందుకు హీరోయిన్లు పోటీప‌డుతుండ‌డ‌మే ఇందుకు నిద‌ర్శ‌నం. అయితే.. అస‌లు సౌంద‌ర్య ఎందుకు స్కిన్ షో చేయ‌లేదు? త‌న తోటి హీరోయిన్లు ర‌మ్య‌కృష్ణ‌, రోజా, న‌గ్మ‌, రంభ లాంటి వాళ్లు అందాల‌ను అవ‌లీల‌గా ఆర‌బోస్తుంటే.. సౌంద‌ర్య మాత్రం చీర గ‌డప ఎందుకు దాట‌లేదు? అనే సందేహం చాలా మందికి ఉంది. దీనివెన‌కున్న సీక్రెట్ లేటెస్ట్ గా రివీల్ చేశారు.. సీనియ‌ర్ నటి ఆమ‌ని.

కార్తికేయ‌-లావ‌ణ్య త్రిపాఠి లేటెస్ట్ మూవీ ‘చావుకబురు చల్లగా’లో నటించారు ఆమని, ఆ సినిమా ప్ర‌మోష‌న్లో భాగంగా ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఈ విష‌యం వెల్ల‌డించారు. ఆమ‌ని, సౌంద‌ర్య చాలా క్లోజ్ గా ఉండేవారు. ఓ సారి నువ్వెందుకు ఎక్స్ పోజ్ చేయ‌వు అని ఆమ‌ని అడిగార‌ట‌. దానికి సౌంద‌ర్య.. ‘‘రేపు పెళ్లైన తర్వాత భర్త, పిల్లలు పక్కనే ఉన్నప్పుడు నా సినిమాలు చూడాల్సి వస్తే ఎలా ఉంటుంది? మ‌న ఫ్యామిలీకి ఎలా అనిపిస్తుంది? అందుకే నేను గ్లామ‌ర్ షో చేయ‌ను’’ అని చెప్పిందట సౌందర్య. ఈ కారణం చేతనే ఆమె కేవలం చీరకట్టులోనే ప్రేక్షకులను అలరించారట.