Begin typing your search above and press return to search.

రీల్ సీన్లను రియల్ గా చూపిస్తూ రచ్చ చేస్తోంది

By:  Tupaki Desk   |   25 Aug 2021 4:34 AM GMT
రీల్ సీన్లను రియల్ గా చూపిస్తూ రచ్చ చేస్తోంది
X
ఈ మధ్యన సెలబ్రిటీలకు ఒక పిచ్చ అంతకంతకూ ముదిరిపోతోంది. తమ ప్రైవేటు ఫోటోల్ని ఎలాంటి మొహమాటం లేకుండా ప్రపంచానికి షేర్ చేసేసి.. మేమెంత ఎంజాయ్ చేస్తున్నామో చూడండి అంటూ చెలరేగిపోతున్నారు. పెళ్లి కాకుండా లివింగ్ టు గెదర్ లాంటివి ఇప్పుడు చాలా కామన్ కావటం తెలిసిందే. బాలీవుడ్ సెలబ్రిటీలు ఇలాంటి విషయాల్ని చాలా ఓపెన్ గా షేర్ చేసుకుంటారు. అయితే.. తండ్రి ఇంట్లోనే ప్రియుడితో కలిసి ఉండే సంచలనం.. సెక్సు గురించి తండ్రితో డిస్కస్ చేయటం లాంటి వాటితో అందరి నోళ్లలో నానుతుంటారు అలియా కశ్యప్.

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె అయిన అలియా సిత్రాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి. తాజాగా తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ప్రైవేటు ఫోటోలు.. హాట్ హాట్ కిస్సింగ్ సీన్లను సోషల్ మీడియాలో పెట్టేసి రచ్చ చేస్తోంది. ఈ తీరును పలువురు తప్పుపడుతూ.. తిట్ల దండకం అందుకుంటూ ట్రోల్ చేస్తుంటే.. మరికొందరు మాత్రం రెచ్చిపో అలియా.. మరింతగా చెలరేగి పో అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు.

రీల్ స్టోరీల మాదిరే అలియా లవ్ స్టోరీ ఉంటుందని చెప్పాలి. డేటింగ్ యాప్ లో షేన్ గ్రెగోయిర్ ను కలవటం.. రెండు నెలల పాటు మాట్లాడుకున్న తర్వాత కలిసిన సందర్భం గురించి అలియా చెబుతుంటే.. ఇలాంటి లవ్వర్ దొరికితే ఎంత బాగుండన్న భావన కలుగక మానదు. ‘‘నేనే కాస్త చొరవ తీసుకున్నా. తన కోసం ఎంతగానో పరితపించాను. రెండు నెలలు మాట్లాడుకున్న తర్వాత తొలిసారి అతన్ని కలిశాను. తను ఎప్పుడెప్పుడు నన్నుముద్దు పెట్టుకుంటాడా? అని ఎదురుచూశాను. అయితే.. అతను మాత్రం కాస్త జంకాడు. అందుకే అతడు మాట్లాడుతుండగానే ధైర్యం చేసి నేనే ముద్దు పెట్టేశా. అతనంటే నాకు అంతలా ఇష్టం ఏర్పడింది’’ అంటూ తన బాయ్ ఫ్రెండ్ మీద ప్రేమను వ్యక్తపర్చింది.

తాజాగా తన లవ్వర్ పుట్టిన రోజు సందర్భంగా అతడి మీద తనకున్న ప్రేమను వ్యక్తం చేస్తూ ఒక పోస్టు పెట్టేసింది. దానికి ఫ్రైవేటు ఫోటోల దొంతరను జత చేసింది. ఇంతకూ ఆమె పోస్టు చేసిన పోస్టు చూస్తే.. ‘ఈ ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతురాలైన అమ్మాయిగా నన్ను మార్చావు. నిన్ను కలిసినందుకు నేనెంత సంతోషంగా ఉన్నానో నాకే తెలుసు. ఎల్లప్పుడూ నిన్న ప్రేమిస్తూనే ఉంటాను ప్రియతమా. నీకు నా 22వ పుట్టినరోజు శుభాకాంక్షలు’ అని పోస్టు చేసింది. ఆమె పోస్టు చేసిన ఫోటోల్లో కొన్ని ప్రైవేటు ఫోటోలుగా ఉండటాన్ని పలువురు తప్పు పడుతున్నారు. ప్రైవేటును పబ్లిక్ చేయటం ఫ్యాషన్ గా మారటం.. అదో ట్రెండ్ అవ్వటంలో ఇలాంటివి అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయన్న మాట వినిపిస్తోంది.