Begin typing your search above and press return to search.

ప్రియుడితో ద‌ర్శ‌కుడి కుమార్తె హ‌ద్దు మీరి..!

By:  Tupaki Desk   |   11 Nov 2021 11:30 PM GMT
ప్రియుడితో ద‌ర్శ‌కుడి కుమార్తె హ‌ద్దు మీరి..!
X
ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ ప్రేమాయ‌ణం గురించి తెలిసిన‌దే. దీనికి పాపా అనురాగ్ అనుమ‌తి ల‌భించింది. ఈ జంట స‌హ‌జీవ‌నం అధికారికం. ఇటీవ‌ల త‌ర‌చుగా త‌న ప్రియుడితో స‌హ‌జీవ‌నానికి సంబంధించిన ఫోటోలు వీడియోలను ఆల‌యా అభిమానుల కోసం సోష‌ల్ మీడియాల్లో షేర్ చేస్తుండ‌గా అవి వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా తన ప్రియుడు షేన్ తో కలిసి రాజస్థాన్ - బికనీర్ లో విహారయాత్రలో ఉల్లాసంగా గడుపుతోంది ఆలియా. ఈ బ్యూటీ ప్ర‌ముఖ‌ వ్లాగర్ గా పాపుల‌ర్. సోషల్ మీడియా స్టార్ గా ఆలియా సుప‌రిచితం. ఇక బిక‌నీర్ నగరంలోని నరేంద్ర భవన్ లో ఉన్న‌ప్ప‌టి కొన్ని ఫోటోల‌ను ఈ జంట‌ ఇన్ స్టాగ్రామ్ లో పంచుకున్నారు.

ఒక ఫోటోలో ఆలియా షేన్‌తో కలిసి రుచికరమైన ఆహారాన్ని ఆస్వాధిస్తూ కనిపించింది. మ‌రొక ఫోటోలో ఆమె షేన్ ను ముద్దాడుతోంది. శృంగార విహారం అనే క్యాప్షన్ తో హ‌గ్గింగ్ ఫోటోని పోస్ట్ చేసింది. ఈ ఫోటోలకు ఫిదా అయిన‌ ఇన్ స్టాగ్రామ్ అనుచరులు ల‌వ్ ఈమోజీల్ని షేర్ చేసారు. ఆలియా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ చెల్లెలు ఖుషీ కపూర్ కు సన్నిహితురాలు. ఖుషీతో సన్నిహిత బంధాన్ని పంచుకోవడంతో పాటు జాన్వీతో కూడా ఆలియాకు మంచి అనుబంధం ఉంది. ఇటీవల ముంబైలోని జాన్వీ ఇంట్లో జరిగిన ఖుషీ బర్త్ డే పార్టీకి కూడా ఆమె హాజరయ్యారు. జాన్వీ తాజాగా ఆలియాకు ఒక చిన్న సలహా ఇచ్చారు. షేన్ ను ముద్దుపెట్టుకుంటున్న ఆలియా ఫోటోపై వ్యాఖ్యానిస్తూ.. `ధ్యానం చేయండి` అని జాన్వీ రాసింది.

ఆలియా కశ్యప్.. అనురాగ్ కశ్యప్ మాజీ భార్య కం ఫిల్మ్ ఎడిటర్ ఆర్తీ బజాజ్ కుమార్తె. ఆలియా అమెరికాలో నివసిస్తున్నారు ప్రముఖ YouTube ఛానెల్ తో అభిమానుల్ని అల‌రిస్తున్నారు. ఇక ఆలియా ఫోటోషూట్ల‌పై జాన్వీ.. ఖుషీ ఎప్ప‌టిక‌ప్పుడు స్పందిస్తూనే ఉంటారు. స్నేహితురాలిని ఆట ప‌ట్టిస్తుంటారు.