Begin typing your search above and press return to search.
అదర చుంబనాలతో 'ఆకాశ వీధుల్లో' తేలిపోతున్నారుగా..!
By: Tupaki Desk | 24 March 2021 10:00 PM ISTగౌతమ్ కృష్ణ దర్శకత్వం వహిస్తూ తానే హీరోగా నటిస్తున్న చిత్రం 'ఆకాశ వీధుల్లో'. పూజిత పొన్నాడ కథానాయిక. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. ప్రముఖ దర్శకుడు క్రిష్ ఈ లుక్ ను లాంఛ్ చేశారు. అయితే.. దాంతోపాటు మరో రొమాంటిక్ పిక్ ను సైతం రిలీజ్ చేసింది యూనిట్.
ఇందులో గౌతమ్ కృష్ణ, పూజిత లిప్ లాక్ తో రెచ్చిపోతున్నారు. ఘాటు ముద్దులతో మన్మథలోకంలో విహరిస్తోందీ జంట. యూత్ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన ఈ పిక్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జీకే ఫిల్మ్ ఫ్యాక్టరీ, మనోజ్ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్లపై మనోజ్ జేడీ, డీజే మణికంఠ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. క్రిష్ తమ సినిమా పస్ట్ లుక్ ను ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందన్న చిత్ర బృందం.. తమ సినిమా అందరినీ ఆకట్టుకుంటుందని ఆశాభావం వ్యక్తంచేశారు.