Begin typing your search above and press return to search.

ఆకాశమే హద్దుగా రెండోస్సారి ఏప్రిల్ 4న సూర్యమూవీ రిలీజ్‌!

By:  Tupaki Desk   |   31 March 2021 3:21 PM IST
ఆకాశమే హద్దుగా రెండోస్సారి ఏప్రిల్ 4న సూర్యమూవీ రిలీజ్‌!
X
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య - అప‌ర్ణ బాల‌ముర‌ళి జంట‌గా సుధాకొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ 'సూరారై పోట్రు'. తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' పేరుతో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. లాక్ డౌన్ స‌మ‌యంలో న‌వంబ‌ర్ లో ప్ర‌ముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో విడుద‌లైంది.

అయితే.. అటు త‌మిళ‌నాట‌, ఇటు తెలుగులోనూ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగిపోయిందీ మూవీ. ఓటీటీలో ఆడియ‌న్స్ వీక్షించిన టాప్ టూ ఇండియ‌న్ సినిమాగా రికార్డు సృష్టించింది. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా అందుకున్న ఈ చిత్రం ఆబాల‌గోపాల‌న్ని అల‌రించింది.

ఒక నిజ‌జీవిత క‌థ‌కు అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగులూ అద్ది అద్భుతంగా తెర‌కెక్కించారు సుధా. ఈ చిత్రం సృష్టించిన అద్భుతం ఆస్కార్ ను కూడా ఆక‌ర్షించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 366 చిత్రాలు ఆస్కార్ బ‌రిలో నిల‌వ‌గా.. భార‌త్ నుంచి 'సూరారై పోట్రు'కు మాత్ర‌మే ఆ ఛాన్స్ ద‌క్క‌డం విశేషం.ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ న‌టి, ఉత్త‌మ డైరెక్ష‌న్‌, ఉత్త‌మ ఒరిజిన‌ల్ స్కోర్ విభ‌గాల్లో ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల‌కు నామినేట్ అయ్యింది. కానీ.. అకాడ‌మీ స్క్రీనింగ్ త‌ర్వాత రౌండ్స్ కు ఈ చిత్రం నామినేట్ కాలేక వెనుదిరిగింది.

ఇంత‌టి అద్భుత చిత్రాన్ని తిరిగి అదే ఓటీటీలో రిలీజ్ చేయ‌బోతున్నారు. అయితే.. ఈ సారి కేవ‌లం హిందీలో. డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఏప్రిల్ 4న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. మ‌రి, హిందీలో ఎలాంటి పెర్ఫార్మెన్స్ న‌మోదు చేస్తుందో చూడాలి.