Begin typing your search above and press return to search.

ఆకాశమే నీ హద్దు ఆఫ్‌ స్ట్రీన్‌ స్టోరీ

By:  Tupaki Desk   |   11 Oct 2020 11:50 AM GMT
ఆకాశమే నీ హద్దు ఆఫ్‌ స్ట్రీన్‌ స్టోరీ
X
సూర్య హీరోగా రూపొందిన 'సూరారై పోట్రు' సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. తెలుగులో ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తెలుగు మరియు తమిళంలో మంచి క్రేజ్‌ ఉన్న ఈ సినిమాను అమెజాన్‌ ప్రైమ్‌ స్ట్రీమింగ్‌ చేయబోతుంది. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభంకు ముందు చాలా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరిగింది. ఆ విశేషాలను వివరిస్తూ చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రమోషన్‌ లో భాగంగా ఒక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో హీరో సూర్య మరియు దర్శకురాలు సుధ కొంగర ఇతర యూనిట్‌ సభ్యులు మాట్లాడారు.

ఆ వీడియోలో దర్శకురాలు సుధ కొంగరా మాట్లాడుతూ.. పదేళ్ల క్రితం కెప్టెన్‌ గోపీనాథ్‌ ఇంటర్వ్యూ చూశాను. సిప్లీ ఫ్లై బుక్‌ చదివి ఆశ్చర్యపోయాను. దాని నుండే ఒక కథను రాసుకున్నాను. సూర్య గారిని కలిసిన సమయంలో కథ ఉంది మీకు సూట్‌ అవుతుందో లేదో నాకు తెలియదు. ఇది ఒకసారి చదవండి అంటూ 40 పేజీల కథను ఇవ్వడం జరిగింది. సూర్య గారు కథకు చాలా ఇంప్రెస్‌ అయ్యారు. ఒక మనిషి జీవితంలో ఇన్ని ఎత్తు పల్లాలు ఉండటం అంటే నిజంగా అద్బుతం. ఖచ్చితంగా ఈ సినిమా చేద్దాం అన్నారు. అలా సినిమా ప్రారంభం అయ్యింది. షూటింగ్‌ నుండి డబ్బింగ్‌ వరకు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నాము అంటూ యూనిట్‌ సభ్యులు వీడియోలో పేర్కొన్నారు.