Begin typing your search above and press return to search.

ఆ సినిమా ఫ్లాపు.. అయినా బిజీ అవుతోందట!

By:  Tupaki Desk   |   31 May 2020 5:47 PM IST
ఆ సినిమా ఫ్లాపు.. అయినా బిజీ అవుతోందట!
X
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో సుమంత్ హీరోగా తెరకెక్కిన 'మళ్ళీ రావా' చిత్రంతో హీరోయిన్ గా ఆకాంక్ష సింగ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత నాగార్జున-నానిల మల్టిస్టారర్ 'దేవదాస్' లో నటించింది. అయితే ఆ సినిమా తర్వాత మాత్రం తెలుగులో ఆఫర్లు రాలేదు. అందుకే కన్నడ సీమపై దృష్టి సారించింది.

శాండల్ వుడ్ లో సుదీప్ సరసన 'పైల్వాన్' అనే కన్నడ సినిమాలో నటించింది. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా ప్రొజెక్ట్ చేస్తూ అన్ని భాషలలో విడుదల చేశారు కానీ అన్ని చోట్ల ఫ్లాప్ గా నిలిచింది. ఈ సినిమా తెలుగులో 'పహిల్వాన్' అనే టైటిల్ తో విడుదలైంది. సినిమా ఫ్లాప్ అయితే అయింది కానీ ఆకాంక్షకు మాత్రం కన్నడలో మంచి ఆఫర్లే వస్తున్నాయట. అయితే ఒక్కటే చిక్కు.. ఆఫర్లు అన్నీ ముదురు హీరోల దగ్గర నుంచే వస్తున్నాయట.

అసలు ఆఫర్లు లేకుండా ఈగలు తోలుకుంటూ.. దోమల బ్యాటింగ్ చేసే కంటే ఈ ఆఫర్లు యాక్సెప్ట్ చెయ్యడమే మేలు కదా. ప్రస్తుతం చేతిలో మంచి ఆఫర్లే ఉన్నాయట. ఆ సినిమాల్లో ఏవైనా రెండు హిట్లు తగిలితే మన తెలుగు ఫిలింమేకర్లు 'మళ్ళీ రావా' అని పిలవడం ఖాయమే.