Begin typing your search above and press return to search.

'పాగల్' కోసం సిద్ శ్రీరామ్ పాడిన ఎమోషనల్ సాంగ్.. 'ఆగవే నువ్వాగవే..'

By:  Tupaki Desk   |   11 Aug 2021 2:02 PM IST
పాగల్ కోసం సిద్ శ్రీరామ్ పాడిన ఎమోషనల్ సాంగ్.. ఆగవే నువ్వాగవే..
X

'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటించిన ''పాగల్'' చిత్రాన్ని ఆగస్ట్ 14న థియేటర్లలో విడుదల చేయనున్నారు. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. వరుసగా ఇంటర్వ్యూలు ఇవ్వడంతో పాటుగా డిఫరెంట్ ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ - సాంగ్స్ ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించగా.. 1600 మంది అమ్మాయిలను ప్రేమించిన 'పాగల్' అంటూ లేటెస్టుగా వదిలిన ట్రైలర్ అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలో తాజాగా మూవీలోని 'ఆగవే నువ్వాగవే' అనే సాంగ్ లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు.

'ఆగవే.. నువ్వాగవే.. పోయే ఊపిరే.. నువ్వాపవే.. చెరగని నీ నవ్వులనే.. అణువణువూ నింపుకున్నా..' అంటూ సాగిన ఈ పాట ఎమోషనల్ గా ఉంది. హీరోయిన్ ప్రేమకు దూరమైన హీరో.. ఆమెను తలచుకుంటూ బాధలో పాడుకుంటున్న ఈ పాట శ్రోతల హృదయాలను ద్రవింపజేస్తుంది. దీనికి సంగీత దర్శకుడు రధన్ అద్భుతమైన బాణీలు సమకూర్చారు. యువ గాయకుడు సిద్ శ్రీరామ్ మరోసారి తన వాయిస్ తో మ్యాజిక్ చేసాడు. గేయ రచయిత కృష్ణ కాంత్ ఈ గీతానికి మంచి సాహిత్యం అందించారు. దీనికి విజయ్ బిన్నీ కొరియోగ్రఫీ చేశారు. 'పాగల్' ఆల్బమ్ లో 'ఆగవే నువ్వాగవే' పాట తనకు బాగా నచ్చినదని హీరో విశ్వక్ సేన్ చెబుతున్నారు.

యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న 'పాగల్' చిత్రానికి న‌రేష్ కొప్పలి దర్శకత్వం వహించారు. ఇందులో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ - సిమ్రాన్ చౌదరి - మేఘ లేఖ హీరోయిన్లుగా నటించారు. రాహుల్ రామకృష్ణ - మురళీ శర్మ - జబర్దస్త్ మహేష్ - ఇంద్రజ శంకర్ ఇతర పాత్రలు పోషించారు. ఎస్ మణికందన్ సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ ఎడిటింగ్ వర్క్ చేశారు. దిల్‌ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేషన్స్ - లక్కీ మీడియా బ్యానర్స్‌ పై బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు.