Begin typing your search above and press return to search.

ఆసక్తి రేపుతున్న యంగ్ హీరో కొత్త సినిమా పోస్టర్..!!

By:  Tupaki Desk   |   23 Dec 2020 10:03 AM IST
ఆసక్తి రేపుతున్న యంగ్ హీరో కొత్త సినిమా పోస్టర్..!!
X
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ గత కొంతకాలంగా సరైన హిట్స్ లేక వెనకబడుతున్నాడు. కెరీర్ ప్రారంభంలో ప్రేమకావాలి, లవ్లీ లాంటి హిట్స్ తర్వాత అలాంటి హిట్స్ మళ్ళీ ఆది కెరీర్ లో రాలేదని చెప్పాలి. అయితే మధ్యలో నెక్స్ట్ నువ్వే సినిమా వచ్చినా అదేం ఆదిని పెద్దగా ఆదుకోలేదు. ప్రస్తుతం ఈ కుర్ర హీరో చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈరోజు ఆది పుట్టినరోజు సందర్బంగా.. తనతో బ్లాక్ సినిమా తెరకెక్కిస్తున్న దర్శక నిర్మాతలు ఆ సినిమా కొత్త పోస్టర్ విడుదల చేశారు. త్వరలో ఆది బ్లాక్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నట్లు తెలుస్తుంది. ఇక పోస్టర్ విషయానికి వస్తే.. బ్లాక్ ఒక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అనిపిస్తుంది.

చూస్తుంటే పోస్టర్ కాస్త ఆసక్తికరంగానే ఉంది. ఎందుకంటే ఇందులో ఆది.. రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించడం విశేషం. ఒకవైపు నార్మల్ లుక్కుతో, మరో వైపు సీరియస్ లుక్కుతో కనిపిస్తున్నాడు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధం అవుతున్న ఈ సినిమా మహంకాళి బ్యానర్ పై.. నూతన దర్శకుడు జి.బి. కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఆది పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. దర్శన బానిక్ హీరోయినుగా నటిస్తున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే ప్రకటించాలని అనుకుంటున్నారట. చూడాలి మరి.. ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అయినా ఆది కెరీర్ కి హిట్ అందిస్తుందేమో..!!