Begin typing your search above and press return to search.

సక్సెస్‌ లేకున్నా బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు ఎలా బాబు?

By:  Tupaki Desk   |   25 April 2021 3:58 AM GMT
సక్సెస్‌ లేకున్నా బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలు ఎలా బాబు?
X
యంగ్‌ హీరోల్లో కొందరు వరుసగా మూడు నాలుగు సినిమాలు ప్లాప్ అయితే మళ్లీ కనిపించనంతగా వెనక్కు వెళ్లి పోతున్నారు. వారు మళ్లీ సినిమాల్లో నటిస్తారా లేదా అనే అనుమానం కూడా కలుగుతుంది. అలాంటిది కొన్ని సంవత్సరాలుగా కంటిన్యూస్ గా ప్లాప్‌ లు పడుతున్నా.. ఒక్క కమర్షియల్ హిట్‌ లేకున్నా కూడా హీరో ఆది సాయికుమార్‌ మాత్రం కెరీర్‌ ముందుకు సాగుతున్నాడు. ఇలా కొద్ది మంది హీరోలకు మాత్రమే జరుగుతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెవులు కొరుక్కుంటున్నారు. ఆది సాయికుమార్‌ కు కమర్షియల్‌ హిట్‌ పడి ఎన్నాళ్లు అయ్యింది అనేది ఆయనకు అయినా గుర్తు ఉందో లేదో కాని ఆఫర్లు మాత్రం వరుసగా వస్తూనే ఉన్నాయి. ఇటీవలే శశి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది అప్పుడే రెండు సినిమా లను లైన్‌ లో పెట్టాడు.

శశి సినిమా కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాని ఫలితం మాత్రం ఎప్పటిలాగే నిరాశ పర్చింది. కరోనా వల్ల శశికి మరింత నష్టం తప్పలేదు. అయినా కూడా ఆది ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. అలాగే ఆయనతో సినిమాలను నిర్మించేందుకు మేకర్స్‌ కూడా వెనుకంజ వేయడం లేదు. ఇటీవలే ప్లాప్‌ డైరెక్టర్‌ వీరభద్ర చౌదరి దర్శకత్వంలో ఆది సినిమా ఒకటి అఫిషియల్ గా అనౌన్స్‌ చేశారు. ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతూ ఉండగానే మరో సినిమా ను ఆది సాయి కుమార్‌ పట్టాలెక్కించాడు. సస్పెన్స్‌ హర్రర్‌ కామెడీ 'అమరన్‌' (ఇన్‌ ది సిటీ చాప్టర్‌ 1) తో ఆది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

అమరన్‌ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. ఈ సినిమాలో ఆదికి జోడీగా అవికా గౌర్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఈ సినిమా తో ఎస్ బాలవీర్ దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్‌ వర్క్‌ ను దాదాపుగా రెండేళ్లు చేసినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా తో పాటు సమాంతరంగా వీరభద్రం సినిమాను చేయబోతున్నారు. అమరన్‌ చాప్టర్‌ 1 అంటూ చెప్పడం వల్ల దీనికి సీక్వెల్‌ కూడా వచ్చేలా ఉందనిపిస్తుంది. భారీ ఎత్తున విజువల్‌ ఎఫెక్ట్స్ తో ఈ సినిమా ఉంటుందని మేకర్స్‌ చెబుతున్నారు. ఆది గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాలో కనిపిస్తాడని చెబుతున్నారు. ఆది ప్రతి సినిమాలో కొత్తగానే కనిపిస్తున్నాడు.. మరి ఈ సినిమాతో సక్సెస్‌ ను దక్కించుకుంటాడా చూడాలి. అయినా సక్సెస్‌ లేకున్నా బ్యాక్ టు బ్యాక్‌ ఇలా ఎలా సినిమాలు దక్కించుకుంటున్నావు బాబు అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు మౌనంగా ప్రశ్నిస్తున్నారు.