Begin typing your search above and press return to search.
ఇక్కడ మరోసారి అదృష్టం పరీక్షించుకోబోతున్న ఆది
By: Tupaki Desk | 13 Nov 2020 2:00 PM ISTఒక వైపు నటుడిగా మరో వైపు హీరోగా నటిస్తూ వస్తున్న ఆది పినిశెట్టి తమిళంలో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో రంగస్థలం.. సరైనోడు వంటి సినిమాల్లో నటిస్తూ విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఆది మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. తెలుగులో ఈయనకు మంచి గుర్తింపు వచ్చిన నేపథ్యంలో ఆయన ఇకపై తమిళంలో చేసే ప్రతి సినిమాను కూడా తెలుగులో కూడా చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఈయన చేస్తున్న గుడ్ లక్ సఖి సినిమాను తెలుగు తమిళంలో రూపొందిస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా రూపొందుతున్న ఆ సినిమాతో పాటు ఆది మరో ద్విభాష సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళ విలక్షణ దర్శకుడు సుశీంద్రన్ దర్శకత్వంలో ఈయన చేయబోతున్న సినిమాను రెండు భాషల్లో రూపొందించబోతున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఆ సినిమాలో మరో తమిళహీరో జై కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.