Begin typing your search above and press return to search.

విలన్ పాత్రలకు ఎన్నడూ వెన్నుచూపడట

By:  Tupaki Desk   |   14 Dec 2015 4:00 AM GMT
విలన్ పాత్రలకు ఎన్నడూ వెన్నుచూపడట
X
ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ తేజ దర్శకత్వంలో దాసరి నారాయణరావుగారి నిర్మాణంలో హీరోగా నటించిన ఆది పినిశెట్టికి తొలి చిత్రం ఒక V చిత్రం సినిమాతో ఆశించిన విజయం రాకపోయినా నటన మీద ఆసక్తి, నటించాలన్న కోరిక పెరిగిందని తెలిపాడు. ఈరోజు అతని జన్మదినం సందర్భంగా చెప్పిన ముచ్చట్లు మీకోసం..

వైశాలి - గుండెల్లో గోదారి సినిమాల ద్వారా అటు తమిళ ప్రేక్షకులకు ఇటు తెలుగు ఆడియన్స్ కి చేరువవ్వడం తన అదృష్టమని తెలిపాడు. ప్రస్తుతం తమ సొంత బ్యానర్ నుండి వస్తున్న మలుపు సినిమా విడుదలపై బిజీగా వున్నట్టు చెప్పాడు. ఈ సినిమా ఇప్పటికే తమిళనాట మంచి విజయం సాధించింది. తెలుగులో త్వరలో విడుదలకానుంది.

ఇక విలన్ పాత్రలకు తానెప్పుడూ ముందేఉంటానని, రజినికాంత్ విక్రమ సింహాలో నటించడం తన అదృష్టమని ప్రస్తుతం బోయపాటి - బన్నీల సరైనోడు సినిమాలో కూడా విలన్ ఛాయలున్న పాత్రలో నటిస్తున్నట్టు స్పష్టం చేశాడు.