Begin typing your search above and press return to search.

కొత్త కుర్ర విలన్ ఎలా ఉంటాడో?

By:  Tupaki Desk   |   19 Feb 2016 1:30 AM GMT
కొత్త కుర్ర విలన్ ఎలా ఉంటాడో?
X
సరైనోడు టీజర్ విడుదలైంది. మెగా ఫ్యాన్స్ తో కేకలు పెట్టిస్తోంది. బోయపాటి కాంబినేషన్ లో బన్నీ మూవీ అంటే ఎలా ఉంటుందో.. ఏ మాత్రం అంచనాలకు తగ్గకుండా కుమ్మేసిందని చెప్పాలి. అయితే ఈ టీజర్ లో మెగా ఫ్యాన్స్ ఇంట్రెస్టింగ్ చూసిన పాయింట్ మరొకటి ఉంది. అదే.. ఈ మూవీ విలన్. మొదటిసారిగా ఆది పినిశెట్టి విలన్ రోల్ పోషించాడు. స్టైలిష్ స్టార్ కి పోటీగా కుర్ర విలన్ ఏ రేంజ్ లో ఉంటాడో చూద్దామని ఫ్యాన్స్ చాలా ఆతృతగానే ఎదురుచూశారు.

హీరోగా అంతగా సక్సెస్ కాలేకపోయిన ఆది పినిశెట్టి.. ప్రస్తుతం మలుపు అనే మూవీని రిలీజ్ చేస్తున్నాడు. బన్నీకి విలన్ గా యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాక.. ఆది పినిశెట్టి సినిమాలపై కూడా మెగా ఫ్యాన్స్ కి ఆసక్తి పెరిగింది. గతంలో వరుడు సినిమాలో బన్నీకి విలన్ గా నటించాడు కోలీవుడ్ హీరో ఆర్య. ఆ తర్వాత ఆర్య నటించిన అనేక సినిమాలు డబ్ అయి, కొన్ని సక్సెస్ కూడా అయ్యాయి. ఇక్కడ మంచి హీరోగా గుర్తింపు దక్కించుకున్నాడు ఆర్య. ఇప్పుడు అదే ట్రెండ్ ఆది పినిశెట్టికి కూడా వర్కవుట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

విలన్స్ ను పవర్ ఫుల్ గా చూపించడంలో బోయపాటి శ్రీను మహా ట్యాలెంటెడ్. మరిప్పుడు బన్నీ- బోయపాటి కాంబినేషన్ లోవచ్చే సినిమాలో ఆది విలన్ గా అంటే.. అంచనాలు పెరిగాయి. అన్నట్లు.. ట్రైలర్ సగం వరకూ ఫేస్ రఫ్ చూపించినది ఆది పినిశెట్టినే. మరి ఈ కొత్త కుర్ర విలన్ ని ఫుల్లుగా చూడాలంటే.. ట్రైలర్ వరకూ ఆగాల్సిందే.