Begin typing your search above and press return to search.

ఆది కెరీర్ మ‌లుపు తీసుకుంటుందా?!

By:  Tupaki Desk   |   21 Feb 2016 5:30 PM GMT
ఆది కెరీర్ మ‌లుపు తీసుకుంటుందా?!
X
సినిమా తీయ‌డం సుల‌భ‌మే. కానీ దాన్ని విడుద‌ల చేసుకోవ‌డమే అన్నిటికంటే క‌ష్టం. తెలుగు ఇండ‌స్ట్రీలోనైతే అది మ‌రింత ఇబ్బందితో కూడుకొన్న వ్య‌వ‌హారం. అలాంటి ప‌రిస్థితుల్లో కూడా ఒకరు చేయూత‌నందిస్తూ సినిమా విడుద‌ల చేసుకోవ‌డానికి దారి చూపించారంటే అదృష్ట‌మనే చెప్పాలి. ఆ అదృష్టం ఆది పినిశెట్టికి దొరికింది. అంతే కాదు... మ‌నోజ్‌ లాంటి క‌థానాయ‌కుడు కూడా యాంక‌ర్‌ గా మారి ఆది సినిమా ప్ర‌మోష‌న్‌ కి సాయం చేశాడు. దీన్నిబ‌ట్టి ఆదికి తెలుగు ఇండ‌స్ట్రీ నుంచి ఎంత సాయం అవ‌స‌ర‌మో అంత సాయం అందింద‌ని అర్థ‌మవుతోంది. ఇక తెలుగులో త‌న కెరీర్‌ ని `మ‌లుపు` తిప్పుకోవ‌డ‌మే కావాలిప్పుడు. మ‌రి ఆది ఇక నుంచి తెలుగు ఇండ‌స్ట్రీపై ఎలా దృష్టిపెడ‌తాడో చూడాలి.

అచ్చ‌మైన తెలుగబ్బాయి ఆది పినిశెట్టి. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ర‌విరాజా పినిశెట్టి త‌న‌యుడు. త‌న తొలి చిత్రాన్ని తెలుగులోనే చేశాడు. కానీ ఆ త‌ర్వాతే ఇక్క‌డ కెరీర్‌ ని మ‌లుచుకోలేక‌పోయాడు. మ‌ధ్య‌లో గుండెల్లో గోదారిలాంటి సినిమా చేశాడు కానీ పెద్ద‌గా ఫ‌లితం ద‌క్క‌లేదు. త‌మిళంలో మాత్రం మంచి జోరునే చూపించాడు. అక్క‌డ ప‌లు చిత్రాల‌తో విజ‌యాలు అందుకొన్నాడు. అయితే ఇటీవ‌ల మ‌లుపుతో మ‌ళ్లీ తెలుగుపై కాన్సంట్రేట్ చేశాడు. బైలింగ్వువ‌ల్‌ గా తెర‌కెక్కిన ఈ చిత్రం త‌మిళంలో ఎప్పుడో విడుద‌లైంది. తెలుగులో విడుద‌ల చేసుకోవ‌డానికి మాత్రం స‌రైన వాతావ‌ర‌ణం ల‌భించ‌లేదు. అయితే ఇటీవ‌లే అల్లు అర‌వింద్‌ కి చెందిన గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ స‌హ‌కారంతో మ‌లుపుని విడుద‌ల చేసుకొన్నాడు ఆది. అల్లు అర్జున్ కొత్త సినిమా స‌రైనోడులో ఆది విల‌న్‌గా న‌టిస్తున్నాడు. దానికితోడు అల్లు అర‌వింద్‌ కీ, ర‌విరాజా పినిశెట్టికీ మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ఆ ర‌కంగా మ‌లుపుని గ్రాండ్‌ గా విడుద‌ల చేసుకోవ‌డానికి ఆదికి మార్గం సుగ‌మ‌మైంది. ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఆ చిత్రానికి మంచి ప్ర‌శంస‌లే ల‌భిస్తున్నాయి. మ‌రి ఈ గుర్తింపును, ఆద‌ర‌ణ‌నీ ఆది భ‌విష్య‌త్తులో ఎలా సద్వినియోగం చేసుకొంటాడో చూడాలి.