Begin typing your search above and press return to search.

పవన్ సినిమాలో సరైనోడి విలనిజం

By:  Tupaki Desk   |   29 March 2017 9:17 AM GMT
పవన్ సినిమాలో సరైనోడి విలనిజం
X
గతేడాది వచ్చిన అల్లు అర్జున్ మూవీ సరైనోడులో ఆది పినిశెట్టి విలనిజం రుచి చూపించాడు. హీరోగా పలు సినిమాలు చేసిన ఆది.. విలన్ పాత్రలో విపరీతంగా మెప్పించాడు. ఆ తర్వాత ఇతనికి అవకాశాలు క్యూ కట్టేయగా.. ప్రస్తుతం ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న ఆది పినిశెట్టికి.. ఇప్పుడు మరో బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ మూవీ ఏప్రిల్ నుంచి మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో నెగిటివ్ కేరక్టర్ కోసం ఆది పినిశెట్టిని సంప్రదించారనే న్యూస్.. ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం ఆది పినిశెట్టితో సంప్రదింపులు జరుగుతున్నాయని.. ఇప్పటివరకూ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నది సినిమా వర్గాలు చెబుతున్న ఇన్ సైడ్ కబుర్లు. అయితే.. ప్రస్తుతం హైద్రాబాద్ లోనే ఆది ఉండగా.. మరికొన్ని రోజుల్లోనే దీనిపై క్లారిటీ వచ్చేయనుంది.

పవన్ లేటెస్ట్ మూవీలో తమిళ కమెడియన్ రోబో శంకర్ ను తీసుకుంటున్నారనే న్యూస్ ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు ఆది పినిశెట్టిని లీడ్ విలన్ రోల్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే.. వీరిద్దరూ ఇంకా అగ్రిమెంట్స్ సైన్ చేయాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/