Begin typing your search above and press return to search.

ఆదికి ఇంకో ఛాన్స్ వచ్చింది

By:  Tupaki Desk   |   18 Jun 2018 10:15 AM IST
ఆదికి ఇంకో ఛాన్స్ వచ్చింది
X
టాలీవుడ్ లో రైటర్లుగా పాపులరైన వాళ్లంతా మెగా ఫోన్ పట్టుకోవడానికి తెగ ఉత్సాహపడుతున్నారు. రైటర్ గా కన్నా డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటే కెరీర్ లో త్వరగా పైకి ఎదిగే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. త్రివిక్రమ్ శ్రీనివాస్ - కొరటాల శివ ఇప్పటికే స్టార్ డైరెక్టర్ల స్థాయికి చేరారు. తాజాగా ఇంకో రైటర్ కూడా డైరెక్టర్ సీట్లోకి వచ్చేయడానికి రెడీ అవుతున్నాడు.

హీరో రామ్ మొదటిసినిమా దేవదాస్ కోసం పనిచేసిన డైమండ్ రత్నబాబు త్వరలో సినిమా డైరెక్టర్ గా మారబోతున్నాడు. సాయికుమార్ తనయుడు ఆది హీరోగా ఆయన సినిమా తీయడానికి ప్లాన్ చేస్తున్నాడు. వరస ఎదురుదెబ్బల తరవాత రీసెంట్ గా హర్రర్ జోనర్ లో నెక్ట్స్ నువ్వే సినిమా చేశాడు. ఈ మూవీ కూడా బాక్సాఫీసును పెద్దగా ఆకట్టుకోలేదు. దీంతో ఆది సినిమాలకు కాస్త విరామమిచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఈ టైంలో రత్నబాబు చెప్పిన స్టోరీ నచ్చడంతో ఆది వెంటనే అతడి డైరెక్షన్ లో నటించేందుకు ఓకే చెప్పాడని తెలిసింది.

ఆది ప్రస్తుతం వినాయకుడు ఫేం అడవి సాయికిరణ్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది దాదాపు కంప్లీటయ్యే స్టేజిలో ఉంది. కెరీర్ మొత్తంమీద రెండు మూడు యావరేట్ సినిమాలు తప్ప నటుడిగా పేరు తెచ్చిన సినిమాలు ఆది ఖాతాలో లేవు. ఇప్పుడు చేస్తున్న సినిమాలు ఆది కెరీర్ కు చాలా కీలకం. వీటితో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటాడో చూడాలి.