Begin typing your search above and press return to search.

ఆది భలే మారిపోయాడే!!

By:  Tupaki Desk   |   1 Jun 2017 10:44 AM IST
ఆది భలే మారిపోయాడే!!
X

ప్రేమ కావాలి అంటూ ఆరేళ్ల క్రితం సినీ అరంగేట్రం చేశాడు సాయి కుమార్ కొడుకు ఆది. ఆ తర్వాత లవ్ లీ అంటూ మరో ఆకట్టుకునే మూవీ చేసినా.. ఐదేళ్లుగా ఆడియన్స్ ను మెప్పించడంలో ఇబ్బంది పడుతూనే ఉన్నాడు. మధ్యలో చేసిన మాస్ హీరో ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. నాలుగేళ్లు హిట్ లేని ఈ హీరో.. ఇప్పుడు కుర్రాళ్లు కలిసి చేస్తున్న ఓ మల్టీస్టారర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

నారా రోహిత్.. సందీప్ కిషన్.. సుధీర్ బాబు.. ఆది.. నలుగురు కుర్రాళ్లు కలిసి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో.. శమంతకమణి అనే మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో ఆది కొత్తగా కనిపించనున్నాడు. ఇప్పటివరకూ కనిపించిన లుక్ కి భిన్నంగా.. మేకోవర్ చేశాడు ఆది. స్టైలిష్ గడ్డంతో.. రఫ్ లుక్ కి ఇటు క్లాస్ టచ్ ఇచ్చిన ఆది డిఫరెంట్ గా కనిపించి ఆకట్టుకోనున్నాడు. శమంతకమణిలో ఆది కేరక్టరైజేషన్ కూడా సూపర్బ్ గా ఉంటుందని.. దీన్ని ఈ కుర్రాడు చేసిన తీరు.. ఆ పాత్రను మరో లెవెల్ కు తీసుకెళుతుందని తెలుస్తోంది.

ఇప్పటివరకూ లవర్ బోయ్ రోల్స్ మాత్రమే చేసిన ఆదికి.. శమంతకమణి చిత్రం ద్వారా కొత్త ఇమేజ్ రావడం ఖాయంగా చెబుతున్నాయి యూనిట్ వర్గాలు. తన పాత్రతో పాటు మిగిలిన కేరక్టర్స్ కూడా ఎంతో అద్భుతంగా ఉంటాయని ఆది అంటున్నాడు. భలే మంచి రోజు చిత్రం ద్వారా దర్శకుడిగా మారిన శ్రీరామ్ ఆదిత్య.. శమంతకమణి మూవీతో తాను కచ్చితంగా హిట్ కొడతానని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/