Begin typing your search above and press return to search.

చుట్టాలబ్బాయ్‌ శిరీష్‌ టైటిల్‌ కదా?

By:  Tupaki Desk   |   11 Jun 2015 5:30 PM GMT
చుట్టాలబ్బాయ్‌ శిరీష్‌ టైటిల్‌ కదా?
X
యువహీరో ఆది బొత్తిగా నల్లపూసయిపోయాడు. అసలు ఫిలింసర్కిల్స్‌లో కనిపించడమే లేదు. ఓ ఇంటివాడయ్యాక పూర్తిగా భార్యా విధేయుడై సంసార జీవనాన్ని ఆస్వాధిస్తున్నాడని సరిపెట్టుకున్నారంతా. సడెన్‌గా ఈరోజు ఓ సినిమా మూహూర్తం చేసుకుంటూ సడెన్‌ షాకిచ్చాడు. అంతేకాదు ఈ సినిమాకి టైటిల్‌ చుట్టాలబ్బాయ్‌ అంటూ మరో షాకిచ్చాడు.

వాస్తవానికి ఈ టైటిల్‌ అల్లు శిరీష్‌ హీరోగా నటించే సినిమాకి అనుకున్నారు. ఇప్పుడిలా ఆదికి ఎలా చిక్కిందో అర్థం కాలేదెవరికీ. ఒకవేళ వీరభద్రమ్‌ రాసుకున్న కథకి ఈ టైటిల్‌ యాప్ట్‌ అనుకుని టైటిల్‌ ఓనర్‌ని రిక్వెస్ట్‌ చేసి తీసుకున్నారేమో. ఏదేమైనా మొత్తానికి యువహీరో భద్రంగా లైమ్‌లైట్‌లోకొచ్చాడు. ఆది పెళ్లికి ముందు రఫ్‌ రిలీజైంది. యావరేజ్‌ అన్న పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత మరో సినిమా ప్రారంభం కావడానికి ఇంతకాలం వేచి చూడాల్సొచ్చింది. కనీసం ఈసారైనా ఓ హిట్‌ కొట్టాలనే ఆశిద్దాం.

ఇకపోతే చుట్టాలబ్బాయ్‌ ఓ పూర్తి కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. కథ కోసం భారీగానే కసరత్తులు చేశాడట. ఏదేమైనా ఆదితో కలిసి ఆన్‌సెట్స్‌ వచ్చేశాడు. చుట్టాలబ్బాయ్‌ టైటిల్‌తోనే ఆకట్టుకున్నారు. విజయం వరిస్తుందేమో చూడాలి.