Begin typing your search above and press return to search.

ఆసక్తికరంగా 'బ్లాక్' టీజర్.. ఖాకీలో అదరగొట్టిన ఆది..!

By:  Tupaki Desk   |   7 Aug 2021 5:49 AM GMT
ఆసక్తికరంగా బ్లాక్ టీజర్.. ఖాకీలో అదరగొట్టిన ఆది..!
X
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్.. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ట్రై చేస్తున్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలో మాస్‌ క‌మ‌ర్షియ‌ల్ హీరోగా నిలబడటానికి.. ఆది తన తండ్రి బాటలో ఖాకీ యూనిఫామ్ వేసుకుంటున్నాడు. ''బ్లాక్'' అనే సినిమా కోసం ఆది సాయి కుమార్ తొలిసారిగా పోలీస్ డ్రెస్ వేసుకున్నాడు. ఇప్పటికే టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమాపై ఆసక్తిని కలిగించిన మేకర్స్.. తాజాగా చిత్ర టీజర్ ను వదిలారు. యువ హీరో సుధీర్ బాబు 'బ్లాక్' టీజర్ ను రిలీజ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందించారు.

'కంటికి కనిపించని కాలయముడు.. ఊహించని కపట నేత్రంతో పద్మవ్యూహంలోకి నెట్టాడు..' అని ఆది సాయికుమార్ చెప్పే డైలాగ్ తో ఈ టీజర్ ప్రారంభమైంది. పోలీస్ ఆఫీసర్ అయిన ఆది.. ఎవరో ఒక నేరస్థుడిని కనిపెట్టడానికి ట్రై చేస్తున్నట్లు చూపించారు. 'కాలసర్పంలా దూసుకొస్తున్న సమస్యల నుంచి బయటకు రావడానికి దారి కోసం వెతుకుతున్నా.. విధి ఆడిన వింత నాటకంలో శత్రువు కనిపించడు.. మరి నేను వెతుకున్న ప్రశ్నలకు సమాధానం ఎవరు?' అనే డైలాగ్ 'బ్లాక్' నేపథ్యాన్ని తెలియజేస్తోంది.

'బ్లాక్' సినిమా పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని టీజర్ ని బట్టి తెలుస్తోంది. ఇందులో 'బిగ్ బాస్' ఫేమ్ కౌశల్ మండా కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు అర్థం అవుతుంది. తన శత్రువు ఎవరో కనిపెట్టడానికి హీరో సాగించే ఇన్వెస్టిగేషన్ అనే పాయింట్ తో వచ్చిన ఈ టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. దీనికి సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది.

'బ్లాక్' చిత్రంలో ఆది సాయికుమార్ సరసన దర్శన బానిక్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆమని - సూర్య - పృథ్వీరాజ్ - సత్యం రాజేష్ - తాగుబోతు రమేష్ - అంఆనంద్ చక్రపాణి - మధునందన్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. జిబి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. మ‌హంకాళి మూవీస్ బ్యాన‌ర్ పై మ‌హంకాళి దివాక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ మూవీకి అమర్ రెడ్డి ఎడిటింగ్ చేస్తున్నారు. కేవీ రమణ ఆర్ట్ డైరెక్టర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న 'బ్లాక్' చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.