Begin typing your search above and press return to search.

క్రీడాకారుడిగా ఆది పినిశెట్టి మ‌రో ప్ర‌యోగం

By:  Tupaki Desk   |   16 Dec 2020 11:00 AM GMT
క్రీడాకారుడిగా ఆది పినిశెట్టి మ‌రో ప్ర‌యోగం
X
ప్ర‌యోగాత్మ‌క క‌థాంశాల్ని ఎంచుకుని ఛాలెంజింగ్ గా న‌టించ‌డం ఆది పినిశెట్టికి తొలి నుంచి అల‌వాటు. అత‌డు న‌టించిన చాలా సినిమాలు మినిమం గ్యారెంటీ చిత్రాలుగా తెలుగు ఆడియెన్ ని ఆక‌ట్టుకున్నాయి. ఇప్పుడు క్రీడాకారుడిగా మ‌రో ప్ర‌యోగానికి ఆది శ్రీ‌కారం చుట్టారు.

ఆది పినిశెట్టి- ఆకాంక్ష సింగ్ జంట‌గా శ‌ర్వంత్ రామ్ క్రియేష‌న్స్‌- శ్రీ షిర్డీసాయి మూవీస్ ప‌తాకాల‌పై రామాంజ‌నేయులు జ‌వ్వాజి ఎం. రాజ‌శేఖ‌ర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం `క్లాప్`. బిగ్ ప్రింట్ పిక్చ‌ర్స్ అధినేత ఐ.బి. కార్తికేయ‌న్ స‌మ‌ర్పిస్తున్నారు. పృథివి ఆదిత్య ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు.

స్పోర్ట్స్ నేప‌థ్యంలో పూర్తి వినోదాత్మ‌క చిత్ర‌మిది. క్లాప్‌ షూటింగ్ పూర్త‌యింది. లాక్ డౌన్ త‌ర్వాత ఇటీవ‌ల‌ చెన్నైలో షూటింగ్ పున‌రుద్ధ‌రించి పూర్తి చేశారు. 65 రోజుల్లో చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. దీనికి సంబంధించి యూనిట్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. చివ‌రి రోజు చివ‌రి సీన్ చిత్రీక‌రించాక‌ హీరో ఆది పినిశెట్టి- డైరెక్ట‌ర్ పృథివి ఆదిత్య స‌హా యూనిట్ మెంబ‌ర్స్ ఒక‌రినొక‌రు అభినందించుకొని సెల‌బ్రేట్ చేసుకున్నారు.

తాము ఊహించిన దానికి మించి స‌న్నివేశాలు చాలా బాగా వ‌చ్చాయనీ, చెన్నైలోని ఓ భారీ స్టేడియంలో చిత్రీక‌రించిన స్పోర్ట్స్ బేస్డ్ సీన్లు హైలైట్ అవుతాయ‌నీ నిర్మాత‌లు తెలిపారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రిపి త్వ‌ర‌లో చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌స్తామ‌న్నారు. ఆది మ‌రో ప్ర‌యోగం తెలుగు ఆడియెన్ ని ఏ మేర‌కు మెప్పిస్తుందో చూడాలి.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.instagram.com/p/CI1_xkSBNot/