Begin typing your search above and press return to search.

ఆర్ ఎక్స్ 100..తమిళంలో హీరో ఎవరంటే?

By:  Tupaki Desk   |   12 Aug 2018 7:25 AM GMT
ఆర్ ఎక్స్ 100..తమిళంలో హీరో ఎవరంటే?
X
ఈ ఏడాది తెలుగులో పెట్టుబడి-రాబడి కోణంలో చూస్తే బిగ్గెస్ట్ హిట్ ‘ఆర్ ఎక్స్ 100’ అనే చెప్పాలి. కేవలం రూ.2 కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటిదాకా ఏకంగా రూ.13-14 కోట్ల దాకా షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది. రిలీజై నెల రోజులు కావస్తున్నా ఇప్పటికే ఓ మోస్తరుగా వసూళ్లు సాధిస్తూ సాగిపోతోందీ చిన్న సినిమా. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి రూపొందించిన ఈ చిత్రం పొరుగు భాషల వాళ్లను కూడా బాగానే ఆకర్షిస్తోంది. తమిళం.. హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. హిందీలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఫాంటమ్ పిక్చర్స్ ‘ఆర్ ఎక్స్ 100’ను రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్ కు అజయ్ భూపతినే దర్శకత్వం వహించే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి అక్కడ హీరో ఎవరన్నది తెలియదు.

ఇక తమిళ రీమేక్ విషయంలోనూ స్పష్టత వచ్చేసింది. ఈ చిత్ర తమిళ రీమేక్ హక్కుల్ని ప్రముఖ నటుడు ఆది పినిశెట్టి తీసుకోవడం విశేషం. అతను సొంత నిర్మాణ సంస్థలో ఈ చిత్రాన్ని చేస్తాడట. మంచి రేటు ఇచ్చి హక్కులు తీసుకున్నాడట ఆది. తమిళ వెర్షన్ ను అజయే డైరెక్ట్ చేయాలని ఆది కోరినట్లు సమాచారం. ఐతే తనకు తమిళం తెలియదని.. కాబట్టి తాను అక్కడ సినిమా తీయలేనని అజయ్ చెప్పేసినట్లు సమాచారం. దీంతో ఎవరైనా తమిళ దర్శకుడితోనే రీమేక్ తీయాలని చూస్తున్నాడు ఆది. ఇంకా ఇతర నటీనటులు.. సాంకేతిక నిపుణుల సంగతి తేలాల్సి ఉంది. తమిళంతో పోలిస్తే ఆది ఇప్పుడు తెలుగులోనే మంచి ఊపుమీదున్నాడు. గత ఏడాది ‘నిన్ను కోరి’.. ఈ ఏడాది ‘రంగస్థలం’ సినిమాలో మంచి విజయాలతో పాటు పేరు కూడా సంపాదించాడు. అతను ప్రధాన పాత్రలో నటించిన ‘నీవెవరో’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.