Begin typing your search above and press return to search.

అఖిల్ తో పినిశెట్టి వార‌బ్బాయి సినిమా?

By:  Tupaki Desk   |   24 Aug 2018 10:55 AM GMT
అఖిల్ తో పినిశెట్టి వార‌బ్బాయి సినిమా?
X
వైశాలి చిత్రంలో మంచి పాత్ర‌తో మెప్పించిన ఆది పినిశెట్టి....ఆ త‌ర్వాత గుండెల్లో గోదారిలో మాస్ పాత్ర‌లో అల‌రించాడు. స‌రైనోడులో విల‌న్ గా ఎంట్రీ ఇచ్చిన ఆది నిన్నుకోరి, రంగ‌స్థ‌లం చిత్రాల‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. త‌మిళంతో పాటు తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆది సోలో హీరోగా న‌టించిన `నీవెవ‌రో `చిత్రం ఈ రోజు విడుద‌లైంది. ఆ చిత్ర ప్ర‌మోష‌న్ లో భాగంగా ఆది ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆది...త‌న అన్న‌య్య స‌త్య ప్ర‌భాస్ పినిశెట్టి గురించి ఓ ఇంట‌రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చాడు. త్వ‌ర‌లోనే త‌న అన్న‌య్య‌ - అక్కినేని అఖిల్ ల కాంబోలో ఓ సినిమా తెరకెక్క‌బోతోంద‌ని హింట్ ఇచ్చాడు ఆది. తెలుగు - హిందీ భాష‌ల్లో నాగార్జున నిర్మించ‌బోతోన్న ఆ చిత్రానికి స‌త్య ప్ర‌భాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ట్లు ఆది క్లూ ఇవ్వ‌డం ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.

త‌న తండ్రి రవిరాజా పినిశెట్టి వారసత్వాన్నందుకుని స‌త్య ప్ర‌భాస్ అందుకున్నాడు. ఆది హీరోగా రాణిస్తుండ‌గా....స‌త్య ప్ర‌భాస్ ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులు వేశాడు. ఆది హీరోగా తెర‌కెక్కించిన `మ‌లుపు`సినిమా అన్న‌ద‌మ్ములిద్ద‌రికీ గుర్తింపు తెచ్చింది. ఆ త‌ర్వాత ఆది...వ‌రుస సినిమాల‌తో బిజీ అయిపోగా....సత్యప్రభాస్ తన రెండో సినిమా చేయడానికి చాలా స‌మ‌యం తీసుకున్నాడు. అయితే, అక్కినేని అఖిల్ హీరోగా ఓ సినిమా చేయాల‌ని స‌త్య ప్ర‌భాస్ గట్టి ప్రయత్నించాడు. కానీ, ఆ ప్రాజెక్ట్ లేట‌వ‌డంతో మ‌రో సినిమా చేయ‌లేక‌పోయాడు. వెంకీ అట్లూరి - అఖిల్ ల‌ సినిమా త‌ర్వాత ....ఆ ప్రాజెక్ట్ ప‌ట్టాలెక్కే అవ‌కాశ‌ముంది. ఇదే విష‌యాన్ని ఆది క‌న్ ఫ‌ర్మ్ చేశాడు. ఒక తెలుగు యంగ్ హీరోతో తెలుగు - హిందీ భాషల్లో ద్విభాషా చిత్రం చేయడానికి సత్యప్రభాస్ సన్నాహాలు చేస్తున్నాడ‌ని చెప్పాడు. అఖిల్ హీరోగా కరణ్ జోహార్ భాగస్వామ్యంలో తెలుగు - హిందీ భాషల్లో నాగార్జున ఓ సినిమా ప్లాన్ చేశాడు. ఆది చెప్పిన సత్యప్రభాస్ సినిమా ఇదేన‌ని టాలీవుడ్ టాక్. మ‌రి, ఈ వార్త ఎంత‌వ‌ర‌కు నిజ‌మో వేచి చూడాలి.