Begin typing your search above and press return to search.

ఫస్ట్ లుక్: U-టర్న్ తీసుకున్న అది

By:  Tupaki Desk   |   3 Aug 2018 10:19 AM GMT
ఫస్ట్ లుక్: U-టర్న్ తీసుకున్న అది
X

సమంత ప్రధాన పాత్రలో - ఆది పినిశెట్టి - రాహుల్ రవీంద్రన్ - భూమిక చావ్లా లు ఇతర ముఖ్య పాత్రలలో నటిసున్న మిస్టరీ థ్రిల్లర్ 'U-టర్న్'. అదే పేరుతో తెరకెక్కిన కన్నడ సినిమాకు రిమేక్ అయిన ఈ చిత్రం తెలుగు-తమిళ భాషలలో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈరోజే అది పినిశెట్టి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది 'U-టర్న్' టీమ్.

ఆది ఫేస్.. అది కూడా మొత్తంగా చూపకుండా తీక్షణంగా చూస్తున్నట్టుగా సగమే చూపించారు. ఒకవైపు ఫోటోలు - రక్తపు మరకలు - న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లాంటివి ఒక మర్డర్ ను సూచిస్తుండగా మరోవైపు సమంతా గొడుగు పట్టుకొని నడుస్తూ ఉంది. సినిమా జానర్ కు తగ్గట్టుగా ఆది ఫస్ట్ లుక్ ఇంటెన్స్ గా ఉంది. ఈ సినిమాలో ఆది ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. సమంతా ఈ సినిమాలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ పాత్రలో నటిస్తోంది.

రీసెంట్ గా టాకీ పార్ట్ ను పూర్తి చేస్తున్న సినిమాకు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. పవన్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వినిమాను వినాయకచవితి పండుగ సందర్భంగా సెప్టెంబర్ 13 న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చరణ్ - సుకుమార్ బ్లాక్ బస్టర్ 'రంగస్థలం' లో కలిసి నటించిన ఆది - సమంతాల ఈ సినిమాలో మరోసారి కలిసి నటించడం విశేషం.