Begin typing your search above and press return to search.

సిట్టిబాబు బ్రో బైక్ రేసింగ్ ప్ర‌యోగం

By:  Tupaki Desk   |   23 Aug 2018 4:31 PM GMT
సిట్టిబాబు బ్రో బైక్ రేసింగ్ ప్ర‌యోగం
X
హైద‌రాబాద్‌ లో వీకెండ్స్‌లో ఏం జ‌రుగుతుందో తెలుసా? మిడ్‌ నైట్ 12 దాటితే రాజ‌ధాని రోడ్ల‌లో ఏం జ‌రుగుతోందో మీకు తెలుసా? ఆదివారాలు రాత్రి వేళ‌ల్లో అలా జూబ్లీ హిల్స్ రోడ్‌ లోకి వెళితే తెలుస్తుంది. ర‌య్ ర‌య్ మంటూ రంకెలేస్తాయి రేసింగ్ బైక్‌ లు. వీకెండ్‌ లో మ‌స్త్ మ‌జా కాంపిటీష‌న్స్‌ తో హోరెత్తిపోతుంది. ఇందులో అమ్మాయిలు అబ్బాయిలు ఉంటారు. వీళ్లంతా చాలా కాస్ట్‌ లీ బ్యాచ్‌. మందేసి సిగ‌రెట్ కొట్టే రౌడీ మూక‌ల టైపు. అంతేనా రేసింగ్ పేరుతో భారీ బెట్టింగుల‌తో చెల‌రేగిపోతాడు. రేసింగ్‌ లో విన్న‌ర్ కి అమ్మాయిల్లో క్రేజు మామూలుగా ఉండ‌దు. అందుకే ఇదే కాన్సెప్టును ప‌ట్టుకున్నాడు ఆది పినిశెట్టి. కంటెంట్‌ ని న‌మ్మి తెలివిగా ముందుకెళుతున్న ఆది, ఇప్ప‌టికే ఆర్‌.ఎక్స్ 100 త‌మిళ రీమేక్‌ లో న‌టిస్తున్నాడు. త‌దుప‌రి చేసే సినిమా ఇంకా ఇంట్రెస్టింగ్. అది బైక్ రేసింగ్‌ పై సినిమా.

ఈరోజు నీవెవ‌రో రిల‌జ్ సందర్భంగా ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఆది.. త‌దుప‌రి ప్రాజెక్టుల‌పై మాట్లాడుతూ .. ఆర్‌.ఎక్స్ 100 త‌మిళ రీమేక్‌ లో న‌టిస్తున్నా. సంఘంలో మ‌గువ ఇలా ఉంది అని చెప్పిన ఈ సినిమా కంటెంట్ న‌చ్చి చేస్తున్నా. ఈ పాత్ర‌కోసం ర‌ఫ్‌ గా మారాలి. అదే త‌ర‌హాలో బైక్ రేసింగ్ నేపధ్యంలో ఓ ఆస‌క్తిక‌ర చిత్రంలో న‌టిస్తున్నా. ఈ రెండు సినిమాల‌కు ఒకే త‌ర‌హాలో ర‌ఫ్‌ గా ఉండే పాత్ర‌లో చేయ‌బోతున్నాను.. అని తెలిపారు.

బైక్ రేసర్ అంటేనే య‌మ కిక్కొస్తుంది. ఆ పాత్ర‌లో ఆది లాంటి ఎన‌ర్జిటిక్ హీరో న‌టిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి భారీ ప్ర‌యోగంలో ఆది ఎలా క‌నిపిస్తాడు? అన్న డిస్క‌ష‌న్ స్టార్ట్ అయ్యింది. గుండెల్లో గోదారి టైమ్‌ లోనే ఆదిలోని ప్ర‌యోగాత్మ‌క‌త అంద‌రికీ అర్థ‌మైంది. రామ్‌చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లంలో సిట్టిబాబుకు అన్న‌గా గోదారి కుర్రాడిగా ఇర‌గ‌దీసేశాడు. ఇప్పుడు నీవెవ‌రో చిత్రంలో అంధుడిగా న‌టించి మ‌రో ప్ర‌యోగం చేశాడు. ఆ వెంట‌నే రేస‌ర్‌ గా ఇంకా పెద్ద ప్ర‌యోగం. ద‌టీజ్ సిట్టిబాబు బ్ర‌ద‌ర్ ఆది పినిశెట్టి అన్న‌మాట‌!