Begin typing your search above and press return to search.

శ‌ర్వా మూవీ సెన్సార్ టాక్ వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   3 March 2022 7:30 AM GMT
శ‌ర్వా మూవీ సెన్సార్ టాక్ వ‌చ్చేసింది
X
శ‌ర్వానంద్ న‌టింటిచిన క్రేజీ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` మ‌రి కొన్ని గంట‌ల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్ప‌టికే కౌంట్ డౌన్ మొద‌లైపోయింది. ఈ చిత్రం శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. కిషోర్ తిరుమ‌ల దర్శ‌క‌త్వంలో శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. చాలా రోజుల త‌రువాత థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్న ప్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో ఈ మూవీపై ఆస‌క్తి నెల‌కొంది.

ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్ గా న‌టించిన ఈ చిత్రంలో వెట‌ర‌న్ హీరోయిన్స్ ఖుష్బూ, రాధికా శ‌ర‌త్ కుమార్, ఊర్వ‌శి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ మూవీ టైటిల్ ప్ర‌క‌టించిన ద‌గ్గ‌రి నుంచి ఈ చిత్రంపై పాజిటివ్ వైబ్స్ మొద‌ల‌య్యాయి. అంతే కాకుండా ఈ చిత్రంలో న‌టించిన శ‌ర్వానంద్, ర‌స్మిక మంద‌న్న‌ల జోడీ కూడా కొత్త‌గా వుండ‌టం.. ప్ర‌మోష‌న‌ల్ పోస్ట‌ర్స్ క‌ల‌ర్ ఫుల్ గా నిండుగా వుండ‌టంతో ఈ మూవీ గ‌త కొన్ని రోజులుగా వార్త‌ల్లో నిలుస్తోంది.

అంతే కాకుండా తాజాగా సెన్సార్ టీమ్ నుంచి కూడా ఈ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్ రావ‌డం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఒక‌టి ఇప్పుడు తాజాగా బ‌య‌టికి వ‌చ్చేసింది. ఇన్ సైడ్ టాక్ ప్ర‌కారం ఈ చిత్రంలో క‌మెడియ‌న్స్ వెన్నెల కిషోర్‌, స‌త్య న‌టించారు.

ఈ ఇద్ద‌రు క‌లిసి ఆడియ‌న్స్ ని ఎంట‌ర్ టైన్ చేయ‌బోతున్నార‌ట‌. వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు, హీరో శ‌ర్వానంద్‌, ర‌ష్మిక మంద‌న్న‌ల కెమిస్ట్రీ.. వీరిద్ద‌రి మ్యారేజ్ నేప‌థ్యంలో ఏర్ప‌డే కాన్ఫ్లిక్ట్ , దేవిశ్రీ‌ప్ర‌సాద్ అందించిన పాట‌లు, నేప‌థ్య సంగీతం.. ప్ర‌తీ ఫ్రేమ్ ని క‌ల‌ర్ ఫుల్ గా తీర్చి దిద్దిన తీరు సినిమాకు ప్ర‌ధాన హైలైట్ లుగా నిల‌వ‌నున్నాయ‌ట‌.

అంతే కాకుండా సీనియ‌ర్ వెట‌ర‌న్ హీరోయిన్ లు ఖుష్బూ, రాధికా శ‌ర‌త్ కుమార్‌, ఊర్వ‌శిల మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు కూడా ఆడియ‌న్స్ ని అమితంగా ఆక‌ట్టుకుంటాయ‌ని తెలుస్తోంది. ఇక శ‌ర్వా క్యారెక్ట‌ర్ కూడా గ‌త చిత్రాలు మ‌హాను భావుడు, ఎక్స్ ప్రెస్ రాజా చిత్రాల‌ని గుర్తు చేసే విధంగా హిలేరియ‌స్ కోట్ తో సాగుతుందిని చెబుతున్నారు. చ‌క్క‌ని ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రానికి సెన్సార్ టీమ్ క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అంటూ కితాబిచ్చేసింది.

ఈ మూవీ ర‌న్ టైమ్ ని 141 నిమిషాల‌కు లాక్ చేసేశారు. సినిమా చూసిన సెన్సార్ మెంబ‌ర్స్ అంతా ఈ మ‌ధ్య కాలంలో చూసిన బెస్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అని, రైట్ టైమ్ లో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నార‌ని చిత్ర బృందంపై ప్ర‌శంస‌లు కురిపించారట‌. టీమ్ కూడా సినిమా స‌క్సెస్ పై మంచి కాన్ఫిడెన్స్ తో వుంది.