Begin typing your search above and press return to search.

ఆడ‌వాళ్లు మీకు జోహార్లు... శ‌ర్వా మొద‌లెట్టేస్తున్నాడు!

By:  Tupaki Desk   |   6 March 2021 8:30 AM GMT
ఆడ‌వాళ్లు మీకు జోహార్లు... శ‌ర్వా మొద‌లెట్టేస్తున్నాడు!
X
బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో శ‌ర్వానంద్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. అత‌డు న‌టించిన శ్రీ‌కారం మార్చి 11న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుంటే... తాజాగా `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రీక‌ర‌ణను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తున్నామ‌ని శ‌ర్వా టీమ్ వెల్ల‌డించారు.

ఈ చిత్రానికి నేను శైల‌జ .. చిత్ర‌ల‌హ‌రి.. రెడ్ వంటి చిత్రాల్ని తెర‌కెక్కించిన కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ప్రేమ‌క‌థ‌ల్ని స్పెష‌ల్ టోన్ తో తెర‌కెక్కించే కిషోర్ తిరుమ‌ల రెడ్ లాంటి క్రైమ్ థ్రిల్ల‌ర్ ని తెర‌కెక్కించారు. ఇప్పుడు ఆడ‌వాళ్లు అంటున్నారు కాబ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టే మంచి ఫ్యామిలీ లేడీ సెంటిమెంట్ సినిమా చేస్తారా? అన్న‌ది చెప్పాల్సి ఉంది. ఈ సినిమా క‌థా కంటెంట్ పై శ‌ర్వా అభిమానుల్లో ఆస‌క్తి నెల‌కొంది.

నేడు శర్వానంద్ పుట్టినరోజు సందర్భంగా నేడు శ‌ర్వా బ‌ర్త్ డే సందర్భంగా ప‌రిశ్ర‌మ స్నేహితులు అభిమానుల‌ నుంచి శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. వ‌రుస‌గా శ‌ర్వా న‌టించే సినిమాల‌ పోస్ట‌ర్లు రిలీజ‌వుతున్నాయి. శ్రీకారం- ఆడవాళ్ళు మీకు జోహార్లు చిత్ర‌బృందాలు శర్వాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాయి. శర్వా పుట్టినరోజు సంద‌ర్భంగా స్నేహితుడు రామ్ చ‌ర‌ణ్ స్వయంగా శర్వా చేత కేక్ కటింగ్ చేయించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.