Begin typing your search above and press return to search.

AA23 అఫీషియల్.. అదిరిపోయే కాంబినేషన్!

By:  Tupaki Desk   |   3 March 2023 9:25 AM
AA23 అఫీషియల్.. అదిరిపోయే కాంబినేషన్!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవికి రిలీజ్ కాబోతుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లోనే ఈ సినిమా తెరకెక్కుతుంది. నార్త్ లో పుష్ప 2పై మంచి క్రేజ్ ఉంది. ఈ మూవీ రిలీజ్ కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక హాసినీ క్రియేషన్స్ లో ఒక సినిమా చేయడానికి కమిట్ అయినట్లు తెలుస్తుంది.

సూపర్ స్టార్ మహేష్ బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ సినిమా స్టార్ట్ చేయనున్నాడు. ఇదిలా ఉంటే దీని తర్వాత బన్నీ చేయబోయే సినిమాకి సంబందించిన తాజాగా అఫీషియల్ అప్డేట్ వచ్చింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్ లో నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు ఒక పోస్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. ఆదిపురుష్ సినిమాని నిర్మించిన టి-సిరీస్ భూషణ్ కుమార్ ఈ మూవీని భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నాడు.

కొద్ది రోజుల క్రితం వీరందరూ కలిసి స్క్రిప్ట్ ఫైనల్ చేసుకొని తీసుకున్న ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశారు. ఇప్పుడు ది కాస్తా వైరల్ అవుతుంది. ఇక టి-సిరీస్ తో పాటు సందీప్ రెడ్డి వంగా హోమ్ బ్యానర్ భద్రకాళి పిక్చర్స్ ప్రొడక్షన్ కూడా ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా ఉండబోతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్ తో హిందీలో పాన్ ఇండియా మూవీగా యానిమల్ చేస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టులో రిలీజ్ అవుతుంది.

దీని తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమాని వచ్చే ఏడాది మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత అల్లు అర్జున్ తో కన్ఫర్మ్ అయిన ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరిద్దరి సినిమాల లైన్ అప్ బట్టి 2024 ఆఖరులో ఈ సినిమా స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.