Begin typing your search above and press return to search.
బన్నీ - సుక్కు సినిమా టైటిల్ ఇదే..!
By: Tupaki Desk | 7 April 2020 11:00 AM ISTస్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్లో 20వ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుకుమార్ ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. తమిళ హీరో విజయ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మదన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. డైరెక్టర్ సుక్కు, బన్నీ కాంబినేషన్ అంటే మనకు గుర్తొచ్చే సినిమా ‘ఆర్య’. వాస్తవానికి అల్లు అర్జున్‌కు స్టార్ డమ్‌ను తీసుకొచ్చిన సినిమా కూడా ఇదే. ఆ తరవాత వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆర్య 2’ వచ్చినా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ జతకట్టారు. ఈ సినిమా కోసం బన్నీ తన వేషం, భాష మార్చుకోవాల్సి వచ్చింది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవరుగా కనిపిస్తారని సమాచారం. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ జరగాల్సింది. కానీ అల్లు అర్జున్ మేక్ ఓవర్ కోసం, బన్నీ చిత్తూర్ స్లాంగ్ కోసం, కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ ఆలస్యమైంది. ఈ చిత్రానికి 'శేషాచలం' అనే పేరు పెట్టారని అప్పట్లో వార్తలొచ్చాయి.
లేటెస్టుగా రేపు తెల్లారితే తొమ్మిది గంటలకు వస్తుండా అంటూ అప్డేట్ ఇచ్చిన విషయం తెల్సిందే. ఆ అప్డేట్ ఈ సినిమాకి సంభందించిన టైటిల్ గురించి అట. బన్నీ – సుక్కు కాంబినేషన్‌లో 'ఆర్య', 'ఆర్య 2' వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు కూడా రెండక్షరాల టైటిల్ నే ఖరారు చేశారట. ఓ అమ్మాయి పేరుని ధ్వనించేలా 'పుష్ప' అనే టైటిల్ పెట్టినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. 'పుష్ప' అనే టైటిల్ అనౌన్స్ అయితే మాత్రం బన్నీ ఫ్యాన్స్ కాస్త సంభ్రమాశ్చర్యాలకు గురవుతారు. ఎందుకుంటే ఓ టాప్ హీరో ఓ టాప్ డైరక్టర్ కలిసి చేసే సినిమాకు 'పుష్ప' అనే టైటిల్ అనేసరికి ఆశ్చర్యమే. అయితే రామ్ చరణ్ సినిమాకు 'రంగస్థలం' అన్నప్పడు ఇలాగే కాస్త ఆశ్చర్య పోయిన వారు వున్నారు. ఇప్పుడు 'పుష్ప' టైటిల్ లోగో కూడా సిద్ధమైపోయిందట. రేపు అల్లు అర్జున్ పుట్టిన రోజు ఈ సందర్భంగా ఈ టైటిల్‌ని ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది రిలీజ్ కాబోయే ఈ సినిమా ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో చూడాలి.