Begin typing your search above and press return to search.

ఏఏ 19 సెట్స్ లో ఏఏ బ్రాండ్ కార‌వ్యాన్

By:  Tupaki Desk   |   18 Jun 2019 11:35 AM IST
ఏఏ 19 సెట్స్ లో ఏఏ బ్రాండ్ కార‌వ్యాన్
X
మ‌న స్టార్ హీరోల కార‌వ్యాన్ ముచ్చ‌ట్లు రెగ్యుల‌ర్ గా వింటున్న‌వే. బాలీవుడ్ హీరోల త‌ర‌హానే .. టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చ‌ర‌ణ్.. మ‌హేష్ .. ఎన్టీఆర్ స‌హా ప‌లువురు స్టార్లు ఇప్ప‌టికే సొంతంగా కార‌వ్యాన్ లు క‌లిగి ఉన్నారు. ఇండ‌స్ట్రీ బెస్ట్ కార‌వ్యాన్ ల‌ను అన్ని ర‌కాల సౌక‌ర్యాల‌తో డిజైన్ చేయించుకున్నార‌ని ఇదివ‌ర‌కూ క‌థానాలొచ్చాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం అదిరిపోయే కార‌వ్యాన్ ని డిజైన్ చేయిస్తున్నార‌ని ఇదివ‌ర‌కూ వార్త‌లొచ్చాయి. ఎట్ట‌కేల‌కు అత‌డి కార‌వ్యాన్ డిజైన్ లుక్ కూడా రివీలైంది.

ఈ కార‌వ్యాన్ ఏ టు జెడ్ బ్లాక్ & బ్లాక్ స్టైల్లో బ్లాక్ గ్లాసెస్ డిజైన్ తో అదిరిపోయింది. దానిపై ప్ర‌త్యేకించి ఏఏ బ్రాండ్ లోగోని డిజైన్ చేయించారు. ఈ కార‌వ్యాన్ ని ముంబైలోని ఓ ఇంటీరియ‌ర్ వ్యానిటీ వ్యాన్ డిజైనింగ్ స్పెష‌లిస్టు వ‌ద్ద డిజైన్ చేయించార‌ట‌. అందుకోసం ఏకంగా 3.5 కోట్లు అద‌నంగా ఖ‌ర్చ‌యింద‌ట‌. కార‌వ్యాన్ కొనేందుకు 3.5కోట్లు దానిని ప్ర‌త్యేకంగా డిజైన్ చేసినందుకు 3.5 కోట్లు.. మొత్తంగా ఖ‌రీదు 7 కోట్లు అయ్యింద‌ట‌. దీనిని డిజైన్ చేయ‌డానికే మూడు నెల‌ల స‌మ‌యం వెచ్చించార‌ట‌. ఇప్ప‌టివ‌ర‌కూ భార‌త‌దేశంలో ఎవ‌రూ డిజైన్ చేయించ‌ని స‌రికొత్త బ్రాండ్ న్యూ ఫీచ‌ర్ల‌తో ఈ కార‌వ్యాన్ ని అల్లు అర్జున్ కోసం డిజైన్ చేశార‌ని తెలుస్తోంది.

అల్లు అర్జున్ ప్ర‌స్తుతం ఏఏ 19 చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా సెట్స్ లో ఏఏ బ్రాండ్ కార‌వ్యాన్ వ‌ల్ల స్టైలిష్ లుక్ రానుంద‌ట‌. ఏఏ 19 చిత్రీక‌ర‌ణ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ - హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే ఈ చిత్రంలో క‌థానాయిక‌గా నటిస్తోంది.