Begin typing your search above and press return to search.

AAGMC ట్రైల‌ర్ : ఫిల్మ్ మేక‌ర్.. ఓ మెడికో మ‌ధ్య సాగే సంఘ‌ర్ష‌ణ‌!

By:  Tupaki Desk   |   5 Sep 2022 12:42 PM GMT
AAGMC ట్రైల‌ర్ : ఫిల్మ్ మేక‌ర్.. ఓ మెడికో మ‌ధ్య సాగే సంఘ‌ర్ష‌ణ‌!
X
నెట్రో స్టార్ సుధీర్ బాబు న‌టించిన లేటెస్ట్ మూవీ `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`. ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కృతిశెట్టి హీరోయిన్. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యాన‌ర్ ల‌పై బి. మ‌హేంద్ర బాబు, కిర‌ణ్ బ‌ల్ల‌ప‌ల్లి సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు. సుధీర్ బాబు, ఇండ్ర‌గంటి మోహ‌న్ కృష్ణ క‌లిసి చేసిన ప్రాజెక్ట్ `స‌మ్మోహ‌నం` మంచి విజ‌యాన్ని సాధించిన స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్ అనిపించుకుంది. ఆ మేవీ త‌రువాత మ‌ళ్లీ ఈ ఇద్ద‌రు క‌లిసి చేసిన సినిమా `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి`.

సెప్టెంబ‌ర్ 16న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. సినిమా రిలీజ్ కు స‌రిగ్గా ప‌ది రోజులు వున్న నేప‌థ్యంలో సోమ‌వారం ఈ మూవీ ట్రైల‌ర్ ని స్టార్ హీరో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా విడుద‌ల చేశారు. ట్రైల‌ర్ రిలీజ్ చేయ‌డం హ్యాపీగా వుంద‌న్న ఆయ‌న `అమ్మాయి గురించి మీకు చెప్పాలి` ఇంట్రెస్టింగ్ గా వుంద‌ని, టీమ్ అంద‌రికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీపై హీరో సుధీర్ బాబు, హీరోయిన్ కృతిశెట్టి భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.

ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌, లిరిక‌ల్ వీడియోస్ సినిమాపై మంచి బ‌జ్ ని క్రియేట్ చేశాయి. తాజాగా రిలీజ్‌ చేసిన ట్రైల‌ర్ కూడా సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తోంది. స‌క్సెస్ ఫుల్ ఫిల్మ్ మేక‌ర్ గా సుధీర్ బాబు న‌టించ‌గా, హీరోయిన్ కావాల‌నుకున్న ఓ మెడికోని ఆమె తల్లిదండ్రులు తీవ్రంగా వ్య‌తిరేకిస్తుండంతో మ‌ద‌న‌ప‌డే యువ‌తిగా హీరోయిన్ కృతిశెట్టి న‌టించింది. త‌ల్లిదండ్రుల‌కు సినీ ఇండస్ట్రీ అంటే హేయ‌మైన భావ‌న వుండ‌టంతో వారిని కాద‌న‌లేక హీరోయిన్ కావాల‌న్న త‌న డ్రీమ్ ని వ‌దులుకోలేక మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌కు గుర‌య్యే క‌థ నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కించిన‌ట్టుగా తెలుస్తోంది.

సినిమాలంటే ఇష్టం వుండే ఈ స‌మాజంలో ఈ రంగంలోకి రావాలంటే మాత్రం వారి పిల్ల‌ల‌కు అడ్డు చెబుతూ సినిమా ఇండస్ట్రీ ఇలాంటిది.. అలాంటిది అంటూ పేలెంట్స్ ఆంశక్ష‌లు విధిస్తూ వుంటారు. అలాంటి త‌ల్లిదండ్రుల కార‌ణంగా న‌లిగిపోయే ఓ యువ‌తి క‌థ‌గా ఈ మూవీని రూపొందించిన‌ట్టుగా ట్రైల‌ర్ తో స్ప‌ష్టం అవుతోంది. చావుకు ద‌గ్గ‌రైన ఓ ఫిల్మ్ మేక‌ర్ ఆ యువ‌తి త‌ల్లిదండ్రుల్ని ఎలా ఒప్పించాడు? .. త‌న‌ని హీరోయిన్ ని చేశాడా? లేదా? అనే ఆస‌క్తిక‌ర‌మైన క‌థా, క‌థానాల‌తో ఈ మూవీని రూపొందించారు.

సినిమాలో సుధీర్ బాబు, కృతిశెట్టిల కెమిస్ట్రీ, వీరిద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిలిచేలా వున్నాయి. పీజీ విందా ఫొటోగ్ర‌ఫీ కూడా మ‌రో హైలైట్ గా నిలుస్తుంద‌ని తెలుస్తోంది. అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, వెన్నెల కిషోర్‌, రాహుల్ రామ‌కృష్ణ‌, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, క‌ల్యాణి న‌ట‌రాజ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ట్రైల‌ర్ తో ప్రామిసింగ్ ప్రాజెక్ట్ అనిపించుకున్న `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సెప్టెంబ‌ర్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.