Begin typing your search above and press return to search.

'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' రిలీజ్‌ డేట్ వచ్చేసిందోచ్‌

By:  Tupaki Desk   |   10 Aug 2022 6:24 AM GMT
ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి రిలీజ్‌ డేట్ వచ్చేసిందోచ్‌
X
సుధీర్ బాబు హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. చాలా రోజుల క్రితమే ఈ సినిమా యొక్క ఫస్ట్‌ లుక్‌ వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది. టీజర్ తో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుంది అంటూ ఎదురు చూసేలా చేసిన యూనిట్‌ సభ్యులు ఎట్టకేలకు విడుదల తేదీని ప్రకటించారు.

ఇన్నాళ్లు మంచి సమయం కోసం వెయిట్‌ చేస్తున్న ఈ చిత్ర యూనిట్‌ సభ్యులు సెప్టెంబర్‌ 16వ తారీకును కన్ఫర్మ్‌ చేశారు. సుధీర్‌ బాబు గత చిత్రాలు మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఆడుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకుంటుందనే అభిప్రాయం ను ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు మీడియా సర్కిల్స్ వారు చర్చించుకుంటున్నారు.

విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న మోహన కృష్ణ ఇంద్రగంటి సినిమా అనగానే ప్రేక్షకుల్లో పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. ఆ కారణంతో కూడా ఈ సినిమా కు మొదటి నుండి పాజిటివ్ బజ్ క్రియేట్‌ అయ్యింది. అన్నింటికంటే ప్రధానంగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌ గా నటించడం వల్ల సినిమా ప్రేక్షకుల్లో మరియు మార్కెట్‌ లో మంచి బజ్‌ ను క్రియేట్‌ చేయగలిగింది అనడంలో సందేహం లేదు.

వరుసగా కృతి శెట్టి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద దాడి చేస్తూనే ఉంది. ఇటీవల ది వారియర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది... ఈ వారంలో మాచర్ల నియోజక వర్గం సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. నెల రోజుల గ్యాప్‌ లో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు గాను రెడీ అయ్యింది.

సినిమాలో సుధీర్‌ బాబు లుక్ తో పాటు కృతి శెట్టి లుక్స్ ఆకట్టుకున్నాయి. అంతే కాకుండా చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌ తో ఈ సినిమా రూపొందినట్లుగా టీజర్ ను చూస్తూ ఉంటే అర్థం అవుతుంది. అందుకే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ఒక విభిన్నమైన సినిమా గా నిలిచి కమర్షియల్‌ సక్సెస్‌ ను దక్కించుకుంటుందేమో చూడాలి.