Begin typing your search above and press return to search.

కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్న యువ హీరో..!

By:  Tupaki Desk   |   13 March 2021 3:30 PM GMT
కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటున్న యువ హీరో..!
X
'ప్రేమతో మీ కార్తీక్' అనే సినిమాతో హీరోగా పరిచయమైన కార్తికేయ.. 'Rx 100' మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన 'హిప్పీ' 'గుణ 369' '90 ML' వంటి సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. అదే సమయంలో నాని 'గ్యాంగ్ లీడర్' చిత్రంలో నెగెటివ్ రోల్ చేయడంతో ఇక యువ హీరో అలాంటి పాత్రలకే పరిమితం అవుతాడేమో అనే కామెంట్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌ లో ''చావు కబురు చల్లగా'' సినిమా స్టార్ట్ చేసి కార్తికేయ ఇంక ట్రాక్ లో పడినట్లేనని అందరూ అనుకునేలా చేశాడు. జీఏ 2 బ్యానర్ లో ఇప్పటివరకు చాలా మంది హీరోలు సక్సెస్ రుచి చూసారు. ఈ క్రమంలో కార్తికేయ కూడా హిట్ కొడతాడానే టాక్ వచ్చేసింది.

కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి తెరకెక్కిస్తున్న 'చావు కబురు చల్లగా' సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. బస్తీ బాలరాజు అనే వైవిధ్యమైన పాత్రలో నటిస్తున్న కార్తికేయకు ఈ సినిమా విజయం అందిస్తుందని నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్న కార్తికేయ.. సడన్ గా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో మూవీ అనౌన్స్ చేసి షాక్ ఇచ్చాడు. ఈ చిత్రానికి సుక్కు ప్రొడ్యూసర్ గా వ్యవహరించడమే కాకుండా స్టోరీ - స్క్రీన్ ప్లే - డైలాగ్స్ కూడా అందించనున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఇటీవలే 'ఉప్పెన' ఏ రేంజ్ సక్సెస్ అయిందో చూశాం. ఒక్క సినిమాతో వైష్ణవ్ తేజ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయాడు. ఇదే ఇప్పుడు కార్తికేయకు కూడా వర్కౌట్ అయితే కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇలా వరుసగా రెండు సినిమాలు పెద్ద ప్రొడక్షన్ హౌస్ లలో చేస్తూ యువ హీరో కెరీర్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడని అనుకోవాలి. ఈ రెండు సినిమాలు హిట్ అయితే మాత్రం కొన్నాళ్ల పాటు కార్తికేయ వెనక్కి తిరిగి చూసుకునే అవసరం రాదని చెప్పవచ్చు.