Begin typing your search above and press return to search.

ట్విస్ట్ అదిరింది: బాల‌య్య కోసం మెగా బ్ర‌ద‌ర్స్‌?

By:  Tupaki Desk   |   25 Dec 2022 1:53 PM GMT
ట్విస్ట్ అదిరింది: బాల‌య్య కోసం మెగా బ్ర‌ద‌ర్స్‌?
X
ఈ పొంగ‌ల్ బ‌రిలో సీనియ‌ర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నంద‌మూరి బాల‌కృష్ణ చాలా ఏళ్ల విరామం త‌రువాత పోటీకి దిగుతున్న విష‌యం తెలిసిందే. గ‌త కొన్ని ద‌శాబ్ద కాలంగా సంక్రాంతి బ‌రిలో సై అంటే సై అంటూ పోటీ ప‌డుతూ వ‌స్తున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌, చిరంజీవి గ‌త ఎనిమిదేళ్లుగా ఈ పోటీకి దూరంగా వున్నారు. అయితే తాజాగా చిరు 'వాల్తేరు వీర‌య్య‌'తో, నంద‌మూరి బాల‌కృష్ణ 'వీర‌సింహారెడ్డి' సినిమాల‌తో పోటీప‌డుతున్నారు.

ఈ రెండు సినిమాపై అభిమానుల్లో మంచి అంచ‌నాలున్నాయి. అంతే కాకుండా ట్రేడ్ స‌ర్కిల్స్ లో భారీ బ‌జ్ కూడా ఈ మూవీస్ పై క్రియేట్ అయింది. సంక్రాంతి కి రిలీజ్ కాబోతున్న ఈ రెండు క్రేజీ సినిమాల‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. బాల‌కృష్ణ న‌టిస్తున్న 'వీర‌సింహారెడ్డి' జ‌న‌వ‌రి 12న రిలీజ్ కాబోతుండ‌గా, చిరు న‌టిస్తున్న వాల్తేరు వీర‌య్య‌' జ‌న‌వ‌రి 13న విడుద‌ల కాబోతోంది. ఈ రెండు సినిమాల్లోనూ శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తోంది.

'వీర సింహారెడ్డి'లో బాల‌య్య డ్యుయెల్ రోల్ చేస్తుండ‌గా, 'వాల్తేరు వీర‌య్య‌'లో చిరుతో క‌లిసి కీల‌క పాత్ర‌లో మాస్ మ‌హారాజా ర‌వితేజ ప‌వ‌ర్ ఫుల్ లో న‌టిస్తున్నాడు. దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం అందించాడు, 'వీర సింహారెడ్డి'కి త‌మ‌న్ సంగీతం అందిచాడు.

ఇకరిని మించి ఒక‌రు ఈ రెండు సినిమాల‌కు పోటీప‌డి మ‌రీ సంగీతం అందించారు. ఈ రెండు సినిమాల రిలీజ్ కి టైమ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో లిరిక‌ల్ వీడియోల‌తో పోటా పోటీగా ప్ర‌యోషన్స్ ని మొద‌లు పెట్టారు.

ఇప్ప‌టికే ఈ రెండు సినిమాల నుంచి లిరిక‌ల్ వీడియోలు వ‌చ్చేశాయి. 'వాల్తేరు వీర‌య్య‌' నుంచి బాస్ పార్టీ, నువ్వు శ్రీ‌దేవైతే..' అంటూ సాగే రెండు సాంగ్స్ విడుద‌ల కాగా.. వీర సింహారెడ్డి' నుంచి 'జై బాల‌య్య‌', సుగుణ సుంద‌రి, మా బావ మ‌నోభావాలు' అంటూ సాగే మూడు పాట‌ల్ని విడుద‌ల చేశారు. 'వాల్తేరు వీర‌య్య‌' నుంచి సోమ‌వారం టైటిల్ సాంగ్ రాబోతోంది. ఇదిలా వుంటే త్వ‌ర‌లో బాల‌య్య 'వీర‌సింహారెడ్డి' కోసం మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ రాబోతున్నార‌ట‌.

జ‌న‌వ‌రి 6న ఒంగోలులో 'వీర‌సింహారెడ్డి' ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ స్థాయిలో నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ వేడుక‌కు చిరంజీవి ఛీఫ్ గెస్ట్ గా రానున్నార‌ని తెలుస్తోంది. అంతే కాకుండా 'చిరు వాల్తేరు వీర‌య్య‌' ఈవెంట్ కు బాల‌కృష్ణ గెస్ట్ గా హాజ‌రు కానున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇలా బాల‌య్య సినిమా ఫంక్ష‌న్ కు చిరు.. చిరు సినిమా ఫంక్ష‌న్ కు బాల‌కృష్ణ గెస్ట్ గా రానుండ‌టం నిజ‌మైతే మెగా నంద‌మూరి ఫ్యాన్స్ కి పండ‌గే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.