Begin typing your search above and press return to search.

బ‌న్నీకి ఎన్ని జ‌త‌లు పంపిస్తున్నావ్ రౌడీ?

By:  Tupaki Desk   |   3 Dec 2020 10:30 AM IST
బ‌న్నీకి ఎన్ని జ‌త‌లు పంపిస్తున్నావ్ రౌడీ?
X
టాలీవుడ్ క్రేజీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండకు బ‌న్నీ థ్యాంక్స్ చెప్పాడు. టాలీవుడ్ లో స్టైల్ ఐకాన్ గా నిలిచిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ రౌడీ బ్రాండ్ కు పెద్ద ఫ్యాన్‌. హీరోగా త‌న క్రేజ్ ‌ని బ్రాండ్ గా మార్చుకున్న రౌడీ హీరో ప్ర‌త్యేకంగా క్లాతింగ్ బ్రాండ్ ని రౌడీ క్ల‌బ్ పేరుతో విజ‌య్ దేవ‌ర‌కొండ స్టార్ట్ చేసిన విష‌యం తెలిసిందే.

ఇందులో యంగ్ స్ట‌ర్స్ కి కావాల్సిన స్టైల్ ఎలివేష‌న్ తో‌ క్లాత్స్ బ్రాండ్స్ అందుబాటులో వుంటున్నాయి. దీంతో ఈ బ్రాండ్స్ ‌కి యూత్ లో హ్యూజ్ క్రేజ్ ఏర్ప‌డింది. ఈ రౌడీ బ్రాండ్ ‌కి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫ్యాన్ గా మారిపోయాడు. దీంతో రౌడీ బ్రాండ్ లో ఏ కొత్త డ్రెస్ డిజైన్ మార్కెట్ లోకి వ‌చ్చినా అది బ‌న్నీకి వెళ్లాల్సిందే. తాజాగా రౌడీ బ్రాండ్ నుంచి ఓ న్యూ స్టైల్ లాంగ్ స్లీవ్ టీష‌ర్ట్ అండ్ ప్యాంట్ ని విజ‌య్ దేవ‌ర‌కొండ బ‌న్నీకి పంపించాడ‌ట‌.

థిక్ బ్లూ క‌ల‌ర్ లో రౌడీ క్ల‌బ్ సింబ‌ల్ ప్రింట్ చేసిన డ్రెస్ క‌లెక్ష‌న్ ని బ‌న్నీకి విజ‌య్ పంపించాడు. ఆ డ్రెస్ ని వేసుకున్న బ‌న్నీ ఆ ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి ఈ కూల్ పెయిర్ ‌ని నా కోసం పంపించినందుకు బ్ర‌ద‌ర్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు..., అండ్ అత‌ని టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నాను. కూల్ కంఫ‌ర్ట్‌..ల‌వ్ ‌లీ షైన్ బ్ర‌ద‌ర్‌` అంటూ బ‌న్నీ కామెంట్ చేశాడు.