Begin typing your search above and press return to search.

సక్సెస్‌ పడ్డ ఏ ఒక్క యంగ్‌ డైరెక్టర్ ని వదలని సూపర్ స్టార్‌!

By:  Tupaki Desk   |   21 Dec 2022 6:30 AM GMT
సక్సెస్‌ పడ్డ ఏ ఒక్క యంగ్‌ డైరెక్టర్ ని వదలని సూపర్ స్టార్‌!
X
తమిళ్‌ సూపర్ స్టార్‌ రజినీకాంత్ సాలిడ్ సక్సెస్ ను దక్కించుకోక ఏళ్లు గడుస్తోంది. సూపర్ హిట్‌ కోసం సూపర్ స్టార్‌ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ దర్శకుల వెంట పడుతున్నాడు. అందులో భాగంగానే పా రంజిత్‌.. కార్తీక్ సుబ్బరాజు.. నెల్సన్ దిలీప్ వంటి వారితో సినిమాలు చేశాడు.. ఇంకా చేస్తూనే ఉన్నాడు.

తాజాగా రజినీకాంత్‌ దృష్టి యంగ్ సెన్షేషనల్ డైరెక్టర్ ప్రదీప్‌ రంగనాథన్ పై పడిందని తెలుస్తోంది. జయం రవి తో కోమలి సినిమాను తెరకెక్కించి సూపర్‌ హిట్‌ దక్కించుకున్న ప్రదీప్ రంగనాథన్‌ మూడు సంవత్సరాల గ్యాప్ తీసుకుని ఇటీవల లవ్ టుడే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన విషయం తెల్సిందే.

తమిళం లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న లవ్ టుడే ను తెలుగు లో దిల్‌ రాజు డబ్ చేసి విడుదల చేసిన విషయం తెల్సిందే. తెలుగు లో కూడా లవ్ టుడే కి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. ఒక యూనిక్ సబ్జెక్ట్‌ తో సినిమాను చేసి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ప్రదీప్‌ రంగనాథన్ కు రజినీకాంత్‌ నుండి పిలుపు వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

మంచి కథను రెడీ చేస్తే రజినీకాంత్‌ డేట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడట. లైకా ప్రొడక్షన్స్ వారు వీరిద్దరి కాంబోలో సినిమా ను నిర్మించేందుకు సిద్ధం అయ్యారనే వార్తలు కూడా వస్తున్నాయి. మొత్తానికి ప్రదీప్ రంగనాథన్ యొక్క స్థాయి అమాంతం పెరిగి పోయింది. రజినీకాంత్‌ తో సినిమా చేసి సక్సెస్‌ దక్కించుకుంటే పాన్ ఇండియా స్థాయిలో ప్రదీప్ కు స్టార్ డమ్ దక్కడం ఖాయం.

లవ్ టుడే సినిమా తో ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ యువ దర్శకుడు కచ్చితంగా రజినీకాంత్‌ తో ఒక భారీ సినిమా ను తీస్తాడేమో చూడాలి. రజినీకాంత్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమా ఉండే అవకాశం ఉంది.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ప్రథమార్థంలో సినిమా ప్రారంభం అయ్యి ద్వితీయార్థం చివర్లో సినిమాను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.